Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నేష‌న‌ల్ ఫైనాన్షియ‌ల్ రిపోర్టింగ్ అథారిటీ ఏర్పాటుకు కేంద్ర‌కేబినెట్ ఆమోదం.


ప్ర‌ధాన‌మంత్రి అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కేంద్ర కేబినెట్ స‌మావేశం, నేష‌న‌ల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ (ఎన్‌.ఎఫ్‌.ఆర్‌.ఎ) ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. అలాగే ఈ సంస్థ‌కు ఒక ఛైర్ ప‌ర్స‌న్‌, ముగ్గురు పూర్తిస్థాయి స‌భ్యులు , ఒక కార్య‌ద‌ర్శి పోస్టును కూడా కేబినెట్ ఆమోదించింది.

2013 కంపెనీల చ‌ట్టంలో తీసుకువ‌చ్చిన కీలక మార్పున‌కు అనుగుణంగా ఆడిటింగ్ వృత్తికి సంబంధించి స్వ‌తంత్ర రెగ్యులేట‌ర్‌గా ఎన్‌.ఎఫ్‌.ఆర్‌.ఎ ఏర్పాటుకు ఈ నిర్ణ‌యం దోహ‌ద‌ప‌డుతుంది. ఆర్థిక వ్య‌వ‌హారాల‌పై ఏర్పాటైన స్థాయీ సంఘం ( 21 వ నివేదిక‌)  ప్ర‌త్యేక సిఫార్సుల‌కు అనుగుణంగా ఈ నిబంధ‌న‌ను చ‌ట్టంలో పొందుప‌రుస్తారు.

ప్ర‌భావం…..

ఈ నిర్ణ‌యం వ‌ల్ల దేశీయ విదేశీ  పెట్టుబ‌డులు పెర‌గడానికి, ఆర్థిక ప్ర‌గ‌తికి దోహ‌ద‌ప‌డుతుంది.  ఆడిటింగ్‌లో అంత‌ర్జాతీయ ప్ర‌మాణాలు విధి విధానాలు పాటించ‌డం ద్వారా వ్యాపార ప్ర‌పంచీక‌ర‌ణ‌కు మ‌ద్ద‌తునివ్వ‌డం, ఆడిటింగ్‌వృత్తి మ‌రింత వృద్ధికి ఇది వీలుక‌ల్పిస్తుంది.

ప‌రిధి…

ఎన్‌.ఎఫ్‌.ఆర్‌.ఎ ప‌రిధి, చార్ట‌ర్డ్ అకౌంటెంట్ల‌పై, వారి సంస్థ‌ల‌పై చ‌ట్టంలోని సెక్ష‌న్ 132 కింద  ద‌ర్యాప్తు చేయ‌డానికి వీలు క‌ల్పిస్తుంది. దీనిని లిస్టెడ్ కంపెనీలు, పెద్ద అన్ లిస్టెడ్ కంపెనీలకు విస్త‌రింప చేయ‌డంతోపాటు ఇందుకు సంబంధించిన ప‌రిమితుల‌ను నిబంధ‌న‌ల‌లో పొందుప‌రుస్తారు.

ప్ర‌జా ప్ర‌యోజ‌నం ఇమిడి ఉన్న సంద‌ర్భాల‌లో ఇత‌ర సంస్థ‌లపై ద‌ర్యాప్తును కూడా కేంద్ర ప్ర‌భుత్వం దీనికి అప్ప‌గించ‌వ‌చ్చు.

1949 నాటి చార్ట‌ర్డ్ అకౌంట్స్ చ‌ట్టంలో సూచించిన విధంగా ఐసిఎఐ రెగ్యులేట‌రి పాత్ర దాని స‌భ్యుల విష‌యంలో కొన‌సాగుతుంది. ప్ర‌త్యేకించి ప‌రిమితుల‌కు లోబ‌డి ప్రైవేటు లిమిటెడ్ కంపెనీల ఆడిటింగ్‌, ప‌బ్లిక్ అన్ లిస్టెడ్ కంపెనీలకు సంబంధించిన నిబంధ‌న‌ల‌ను నోటిఫై చేస్తారు.

 

క్వాలిటీ రివ్యూ బోర్డు ( క్యుఆర్‌బి) ప్రైవేటు లిమిటెడ్ కంపెనీల‌కు సంబంధించి క్వాలిటీ ఆడిట్‌ను కొన‌సాగిస్తుంది. ప‌రిమితి కంటే త‌క్కువ‌గ ల‌ ప‌బ్లిక్ అన్‌లిస్టెడ్ కంపెనీల ఆడిట్‌ను ఎన్‌.ఎఫ్‌. ఆర్‌.ఎ సంస్థ‌ క్యు.ఆర్‌.బి కి అప్ప‌గించ‌వచ్చు. ఇంకా, ఐసిఎఐ అకౌంటింగ్‌,ఆడిటింగ్ ప్ర‌మాణాలు,విధానాల‌కు సంబంధించి ఎన్‌.ఎఫ్‌.ఆర్‌.ఎకు సిఫార్సు చేసేందుకు ఐసిఎఐ త‌న స‌ల‌హాపాత్ర‌ను కొన‌సాగిస్తుంది.

నేప‌థ్యం…

అకౌంటింగ్ రంగంలో వెలుగు చూస్తున్న ర‌క‌ర‌కాల కుంభ‌కోణాల కార‌ణంగా  ప్ర‌పంచంలోని వివిధ వ్య‌వ‌స్థ‌లు స్వ‌తంత్ర రెగ్యులేట‌ర్లు ఉండాల్సిన అవ‌స‌రాన్ని గుర్తించ‌డంతో ఎన్.ఎఫ్‌.ఆర్‌.ఎ ఆలోచ‌న ముందుకు వ‌చ్చింది. ఇది తాను నియంత్రించే వ్య‌వ‌స్థ‌ల విష‌యంలో స్వ‌తంత్ర‌ను క‌లిగి ఉంటుంది. ఆడిట్ సంస్థ‌ల స్వతంత్ర‌త‌ను బ‌లోపేతం చేయ‌డానికి , ఆడిట్‌ల నాణ్య‌త‌ను కాపాడ‌డానికి, ఆడిటింగ్ ప్ర‌మాణాలు పాటించ‌డానికి ఇది ఉప‌క‌రిస్తుంది.ఫ‌లితంగా ఇది కంపెనీలు వెల్ల‌డించే ఆర్ధిక వివ‌రాల విష‌యంలో ఇన్వెస్ట‌ర్లు, ప్ర‌జ‌ల‌కు విశ్వాసాన్ని క‌లిగిస్తుంది.