Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నైపుణ్యం, కఠోర శ్రమ, విద్య, వినమ్రమైన మాట తీరు.. ఈ సద్గుణాలను చాటిచెప్పే


నైపుణ్యంకఠోర శ్రమవిద్యకరుణ.. ఇవి మానవ జీవితంలో అద్భుత శక్తులని చాటిచెబుతున్న సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారువీటితో మనం అన్ని సవాళ్లనూ అధిగమించడంతో పాటు మన లక్ష్యాలను సాధించుకోవడంలో సహాయాన్ని కూడా పొందవచ్చని ఆయన స్పష్టం చేశారు.
నైపుణ్యం కలిగిన వారికి ఏ పనీ కఠినమైంది కాదని కూడా ప్రధానమంత్రి అన్నారుకష్టపడి పనిచేసే వారికి ఏ లక్ష్యమూ అందుకోలేనిది కాదు.. విద్యావంతులకు స్వదేశంవిదేశం అన్న తేడా ఉండదు.. అలాగేనమ్రతతో మాటలాడే వారికి ఎవ్వరూ అపరిచితులుగా అనిపించరని ప్రధానమంత్రి వివరించారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో  ఒక సందేశాన్ని ప్రధానమంత్రి శ్రీ మోదీ పొందుపరుస్తూ 
‘‘
కౌశలంపరిశ్రమకరుణ.. ఇవి మన జీవనంలో అద్భుత శక్తులువీటితో మనం ప్రతి సవాలునూ ఎదుర్కొనిపైచేయిని సాధించవచ్చుఅంతేకాదుఇవి మన లక్ష్యాలను నెరవేర్చుకోవడంలోనూ తోడ్పడతాయి.
కో హి భారః సమర్థానాం కిం దూరం వ్యవసాయినామ్
కో విదేశః సువిద్యానాం కః పరః ప్రియవాదినామ్’’ అని పేర్కొన్నారు.

నైపుణ్యం కలిగిన వారికి ఏ పనీ కఠినమైంది కాబోదుకష్టించి పనిచేసే వారికి ఏ లక్ష్యమైనా నెరవేర్చుకోలేనిదిగా ఉండదువిద్యావంతులకు ఇది తమ సొంత దేశంపరాయి దేశం అనే తేడాలంటూ ఉండవుమరి అలాగే వినమ్రంగా మాట్లాడే వారికి ఎవ్వరూ అపరిచితులుగా మిగలరని ఈ సూక్తి మనకు బోధిస్తోంది.

***