Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

న్యూ ఢిల్లీ లో ఎఎస్ఐ నూత‌న ప్రధాన కేంద్రాన్ని ప్రారంభించ‌నున్న ప్ర‌ధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ 2018, జులై 12వ తేదీ నాడు న్యూ ఢిల్లీ లోని తిల‌క్ మార్గ్ లో ది ఆర్కియాలజిక‌ల్ స‌ర్వే ఆఫ్ ఇండియా (ఎఎస్ఐ) నూత‌న ప్రధాన కేంద్రాన్ని ప్రారంభించ‌నున్నారు.

వాన నీటి సంరక్షణ సదుపాయం మ‌రియు శ‌క్తి వ‌న‌రులతో సమృద్ధమైన‌టువంటి దీపాల స‌దుపాయం తో స‌హా అత్యధునాత‌న సౌక‌ర్యాలు ఈ నూత‌న ప్రధాన కేంద్రం లో అమ‌ర్చ‌బ‌డ్డాయి. దాదాపు 1.5 ల‌క్ష‌ల పుస్త‌కాలు, ఇంకా ప‌త్రిక‌ల సంచయం తో కూడిన ఓ కేంద్ర పురావ‌స్తు గ్రంథాల‌యం కూడా దీనిలో భాగంగా ఉంటుంది.

***