పిఎంఇండియా
పంజాబ్లోని ఫిరోజ్పూర్ జిల్లాలో జరిగిన ప్రమాదంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన ఆయన.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.
మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి రూ. 2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు ప్రధాని ప్రకటించారు. గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నట్లు ఆయన తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధాని ఈ విధంగా పేర్కొన్నారు:
“పంజాబ్లోని ఫిరోజ్పూర్ జిల్లాలో జరిగిన ప్రమాదం గురించి తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఈ ప్రమాదంలో తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.
పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తాం.”
Deeply pained to hear about a mishap in Ferozepur district, Punjab. My condolences to those who have lost their loved ones. Wishing a speedy recovery to the injured.
— PMO India (@PMOIndia) June 6, 2026
An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. The injured would be…