Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పండిత్ శ్రీ ధర్మశీల్ చతుర్వేది మృతికి సంతాపం తెలిపిన ప్ర‌ధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రముఖ తత్వవేత్త, రచయిత మరియు పాత్రికేయుడు పండిత్ శ్రీ ధర్మశీల్ చతుర్వేది కన్నుమూత పట్ల సంతాపం వ్యక్తం చేశారు.

“కాశీ నుండి దు:ఖదాయకమైన కబురు అందుకున్నాను; ప్రముఖ తత్వవేత్త, రచయిత మరియు పాత్రికేయుడైన పండిత్ శ్రీ ధర్మశీల్ చతుర్వేది ఇక లేరని తెలిసింది. ఆయనకు ఇవే నా సంతాపాలు.

పండిత్ శ్రీ ధర్మశీల్ చతుర్వేది యొక్క పదునైన, చమత్కారం మరియు హాస్యం నిండిన రచనలు విస్తారమైన పాఠకలోకానికి ఆయనను ప్రీతిపాత్రుడిని చేశాయి. మన మధ్య నుంచి ఆయన కనుమరుగు అయ్యారు..” అంటూ ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.

***