Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పఠాన్ కోట్ ఎయిర్ బేస్ ను సందర్శించిన ప్రధాని

పఠాన్ కోట్ ఎయిర్ బేస్ ను సందర్శించిన ప్రధాని

పఠాన్ కోట్ ఎయిర్ బేస్ ను సందర్శించిన ప్రధాని


పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ ను ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ సందర్శించారు. ఇటీవలే ఈ ఎయిర్ బేస్ వద్ద ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఉగ్రవాదుల దాడిని తిప్పికొట్టిన విధానాన్ని, ఉగ్రవాదుల ఏరివేతకు చేపట్టిన ఆపరేషన్ వివరాలను రక్షణ దళాలకు చెందిన సీనియర్ అధికారులు ప్రధానికి వివరించారు. ఎయిర్ బేస్ లోని సంబంధిత ప్రాంతాలను ప్రధాని పరిశీలించారు. సరిహద్దు ప్రాంతాన్ని ఏరియల్ సర్వే ద్వారా వీక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రధానితోపాటు జాతీయ భద్రతా సలహాదారు శ్రీ అజిత్ దోవల్, పదాతి, వైమానిక దళాల అధిపతులతోపాటు ఎన్ ఎస్ జి, బిఎస్ ఎఫ్ అధిపతులు పాల్గొన్నారు.