పిఎంఇండియా
పరస్పర అభ్యసనం-శ్రవణ ప్రాధాన్యాన్ని వివరించే ఒక సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ప్రజలతో పంచుకున్నారు. పరస్పర అవగాహనతో అధ్యయనం, శ్రవణం దిశగా ఉత్సాహం చూపేవారు జ్ఞానుల ప్రశంసలు పొందుతారనే ఆ సుభాషిత అర్థాన్ని ఆయన వివరించారు. అలాంటి వారు స్వార్థ త్యాగులుగా నిలవడమేగాక నిగూఢ యోచనల నుంచి విముక్తులవుతారని తెలిపారు. అలాగే, అన్ని విధాలా ఆనందోత్సాహాలలో వర్ధిల్లుతారని వ్యాఖ్యానించారు:
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో కింది సుభాషితాన్ని ఆయన పంచుకున్నారు:
“జ్ఞానవృద్ధాః ప్రశంసన్తి శుశ్రూషంతః పరస్పరమ్।
వినివృత్తాభిసంధానః సుఖమేధన్తి సర్వశః॥“
***
ज्ञानवृद्धाः प्रशंसन्ति शुश्रूषन्तः परस्परम्।
— Narendra Modi (@narendramodi) August 26, 2026
विनिवृत्ताभिसन्धानाः सुखमेधन्ति सर्वशः॥ pic.twitter.com/JoTDKpmwnM