పిఎంఇండియా
సమాజంతో సద్భావనను కలిగి ఉండే కళను జ్ఞానం నేర్పిస్తుందని ప్రస్తావిస్తున్న సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు. జ్ఞానంతో వివేకాన్నీ, ధనాన్నీ పొందవచ్చును. జ్ఞానం.. మనసును ఆనందంతో నింపివేస్తుంది. ఫలితంగా వ్యక్తి ఆత్మగౌరవం పెంపొందుతుందని ప్రధానమంత్రి అన్నారు.
‘‘ఉపదిశతి లోకవృత్తం వితరతి విత్తం వినోదయతి చిత్తమ్
ఉత్తమ్భయతి మహత్త్వం విద్యా హృద్యా సురాజసేవేవ’’ అన్న ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి పంచుకున్నారు.
సమాజంతో సద్భావనను కలిగివుంటూ జీవించే కళను విద్య నేర్పుతుంది. ఈ జ్ఞానమే వివేకాన్నీ, ధనాన్నీ అందిస్తుంది. వ్యక్తి మనసును సంతోషంతో నింపివేయడంతో పాటు, వ్యక్తి ఆత్మగౌరవాన్ని కూడా పెంపొందిస్తుంది. ఈ కారణంగా సుపరిపాలన అందజేసే సేవ మాదిరిగానే విద్య కూడా చాలా విలువైందీ, మనసు ప్రేమించేదీ, జీవన స్థాయిని పెంపొందింప చేసే శక్తిగా చెప్పవచ్చని ఈ సుభాషితం మనకు బోధిస్తోంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘ఉపదిశతి లోకవృత్తం వితరతి విత్తం వినోదయతి చిత్తమ్
ఉత్తమ్భయతి మహత్త్వం విద్యా హృద్యా సురాజసేవేవ’’ అని పేర్కొన్నారు.
***
उपदिशति लोकवृत्तं वितरति वित्तं विनोदयति चित्तम्।
— Narendra Modi (@narendramodi) September 9, 2026
उत्तम्भयति महत्त्वं विद्या हृद्या सुराजसेवेव॥ pic.twitter.com/aGyBAeszzx