Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పశ్చిమ బెంగాల్లోని బీర్భూమ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణనష్టం పట్ల ప్రధాని సంతాపం


పశ్చిమ బెంగాల్లోని బీర్భూమ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో సంభవించిన ప్రాణ నష్టం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
తమ ఆత్మీయులను కోల్పోయిన వారికి సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఈ ప్రమాద బాధితులకు స్థానిక యంత్రాంగం అవసరమైన సాయం అందిస్తోందని ప్రధాని తెలియజేశారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది:
‘‘పశ్చిమ బెంగాల్లోని బీర్భూమ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించిందని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఆత్మీయులను కోల్పోయిన వారికి సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఈ ప్రమాద బాధితులకు స్థానిక యంత్రాంగం సాయం అందిస్తోంది.’’

 

***