Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్‌లో జరిగిన ప్రమాద బాధితులకు ఎక్స్–గ్రేషియాను ప్రకటించిన ప్రధానమంత్రి


పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్‌లో జరిగిన ప్రమాద బాధితులకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎక్స్–‌గ్రేషియా ప్రకటించారు. మరణించిన వారి కుటుంబానికి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున పరిహారం అందజేస్తామని పీఎం తెలిపారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి కార్యాలయం చేసిన పోస్టు:

‘‘పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్‌లో జరిగిన ప్రమాదంలో మృతుల కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున ఎక్స్‌–గ్రేషియాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు.’’