Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పాకిస్తాన్ ఆక్రమిత జమ్ము & కశ్మీర్ నుండి మరియు ఛంబ్ నుండి నిర్వాసితులైన కుటుంబాలకు ప్రైమ్ మినిస్టర్స్ డెవలప్ మెంట్ ప్యాకేజ్ ఫర్ జమ్ము & కశ్మీర్, 2015 లో భాగంగా పునరాశ్రయ ప్యాకేజికి మంత్రిమండలి ఆమోదం


జమ్ము & కశ్మీర్ కు ప్రధాన మంత్రి యొక్క అభివృద్ధి ప్యాకేజి-2015 ని 2015 నవంబర్ లో ప్రకటించిన దరిమిలా పాకిస్తాన్ ఆక్రమిత జమ్ము & కశ్మీర్ (పిఒజెకె) మరియు చాంబ్ నుండి నిర్వాసితులైన 36,384 కుటుంబాలకు రూ.2,000 కోట్ల కేంద్ర సహాయాన్ని అందించడానికి కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశానికి అధ్య‌క్ష‌త వ‌హించారు.

ప్యాకేజి ప్రకారం, నిర్వాసిత కుటుంబాలు ఆదాయాన్ని ఆర్జించి జీవనాధారాన్ని సమకూర్చుకోవడానికి వీలుగా ఒక్కొక్క కుటుంబానికి రూ.5.5 లక్షల నగదు ప్రయోజనాన్ని బట్వాడా చేయడం జరుగుతుంది. ఈ మొత్తాన్ని అర్హమైన కుటుంబాలకు ప్రత్యక్ష ప్రయోజనం బదిలీ (డిబిటి) ద్వారా బట్వాడా చేసేందుకు గాను జమ్ము & కశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేస్తారు.

1947లో దేశం విభజనకు గురి అయిన అనంతరం, జమ్ము & కశ్మీర్ రాష్ట్రంలోని పాకిస్తాన్ ఆక్రమిత ప్రాంతాలలో నుండి వేలాది కుటుంబాలు జమ్ము & కశ్మీర్ రాష్ట్రానికి వలసపోయారు. ఆ తరువాత, 1965 మరియు 1971 ఇండో-పాక్ యుద్ధాల వేళ జమ్ము & కశ్మీర్ కు చెందిన ఛంబ్ నియబత్ ప్రాంతం నుండి పెద్ద సంఖ్యలో కుటుంబాలు నిర్వాసితులయ్యారు. పిఒజెకె నుండి, ఛంబ్ నుండి నిర్వాసితులైన వారి కష్టాలను తగ్గించడం కోసం మరియు వారికి పునరాశ్రయం కల్పించడం కోసం భారత ప్రభుత్వం/ జమ్ము & కశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సహాయక ప్యాకేజిలను, పునరావాస ప్యాకేజిలను ప్రకటిస్తూ వచ్చాయి.