Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

“పిఎం-కిసాన్‌”ను ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లోని గోర‌ఖ్‌పుర్ నుండి ప్రారంభించిన ప్ర‌ధాన మంత్రి

“పిఎం-కిసాన్‌”ను ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లోని గోర‌ఖ్‌పుర్ నుండి ప్రారంభించిన ప్ర‌ధాన మంత్రి

“పిఎం-కిసాన్‌”ను ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లోని గోర‌ఖ్‌పుర్ నుండి ప్రారంభించిన ప్ర‌ధాన మంత్రి

“పిఎం-కిసాన్‌”ను ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లోని గోర‌ఖ్‌పుర్ నుండి ప్రారంభించిన ప్ర‌ధాన మంత్రి


 

ప్ర‌ధాన మంత్రి గోర‌ఖ్‌పుర్ మ‌రియు ఉత్త‌ర్ ప్ర‌దేశ్ తూర్పు ప్రాంతాల కు సంబంధించిన‌ అభివృద్ధి ప‌థ‌కాల ను కూడా ఆవిష్కరించారు

ప్ర‌ధాన మంత్రి కిసాన్ స‌మ్మాన్ నిధి (పిఎం-కిసాన్‌) ను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నేడు గోర‌ఖ్‌పుర్ నుండి ప్రారంభించారు.

నేటి ఈ శుభారంభం తో  ఎంపిక చేసిన కొంత మంది ల‌బ్దిదారు రైతుల బ్యాంకు ఖాల లోకి 2,000 రూపాయ‌ల తొలి వాయిదా నేరు గా జ‌మ కానుంది.

‘ప్ర‌ధాన మంత్రి కిసాన్ స‌మ్మాన్ నిధి’ ప్రారంభం అయినందుకు  ప్ర‌ధాన మంత్రి రైతుల కు అభినంద‌న‌లు తెలిపారు.  అలాగే, పాడి ఉత్పత్తులు మ‌రియు మ‌త్స్య పాలన లో నిమ‌గ్న‌మైన రైతు కుటుంబాల కు కూడా ఆయ‌న అభినంద‌న‌లు తెలియజేశారు.  దీనికి కారణం, ఈ రైతు కుటుంబాల కు ఇక కిసాన్ క్రెడిట్ కార్డులు అందుబాటు లోకి రానున్నాయి.

కార్యక్రమానికి తరలివచ్చిన జ‌న స‌మూహాన్ని ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగిస్తూ, స్వాతంత్య్రం వ‌చ్చిన త‌రువాత రైతుల కు సంబంధించిన అతి పెద్ద ప‌థ‌కం ఈ రోజు న ప్రారంభం కావ‌డం తో నేటి రోజు చ‌రిత్ర లో చెరిగిపోని విధంగా న‌మోదు అయినట్లు పేర్కొన్నారు.  

స‌మ‌ర్ధులు గా, సాధికారిత క‌లిగిన వారు గా రైతుల ను తీర్చిదిద్దాల‌న్న‌దే ప్ర‌భుత్వం యొక్క దృఢ సంక‌ల్ప‌ం అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  రైతుల ఆదాయం 2022వ సంవ‌త్స‌రాని క‌ల్లా రెట్టింపు అయ్యేట‌ట్లుగా వారికి త‌గిన సాధనాల‌న్నింటినీ స‌మ‌కూర్చేందుకు ప్ర‌భుత్వం కృషి చేస్తోంద‌ని ఆయ‌న వివ‌రించారు.

దాదాపుగా 12 కోట్ల మంది రైతుల కు పిఎం-కిసాన్ నుండి ప్రయోజనం సమకూరనుందన్న అంచనా ఉంది.  ఈ ప‌థ‌కం ద్వారా ప్ర‌తి సంవ‌త్స‌రం 75 వేల కోట్ల రూపాయ‌లు రైతుల ఖాతాల లోకి బ‌ద‌లాయించ‌డం జ‌రుగుతుంద‌ని ప్ర‌ధాన మంత్రి వెల్ల‌డించారు.  ల‌బ్దిదారు రైతుల జాబితా ను కేంద్ర ప్ర‌భుత్వాని కి వీలైనంత త్వ‌ర‌గా పంపవలసిందిగా రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ కు ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు.  ఇలా చేస్తే, రైతులు ఈ ప‌థ‌కం తాలూకు ప్ర‌యోజ‌నాన్ని స‌కాలం లో పొంద‌గ‌లుగుతార‌ని ఆయ‌న వివ‌రించారు.
 
ఇదివ‌ర‌క‌టి ప్ర‌భుత్వాలు ఆయా సమయాల లో ప్ర‌క‌టించిన రుణ మాఫీ లు రైతుల కు దీర్ఘ‌కాలిక ఉపశమనాన్ని గాని, లేదా స‌మ‌గ్ర‌మైన ఉప‌శ‌మ‌నాన్ని గానీ అందించ లేద‌ని, పిఎం-కిసాన్ వారి కి ఉప‌శ‌మ‌నాన్ని క‌ల్పించ‌డ‌మే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్య‌వ‌స్థ లో ఒక బృహ‌త్త‌ర‌మైన పెట్టుబ‌డి కి గుర్తు గా కూడా నిలచి పోనుంద‌ని ప్ర‌ధాన మంత్రి వివ‌రించారు.

పిఎం-కిసాన్ ప్ర‌త్య‌క్ష బ‌దిలీ పై ఆధార‌ప‌డుతుంద‌ని, మ‌రి ఈ కార‌ణం గా మొత్తం సొమ్ము లబ్దిదారు కు చేరుతుంద‌ని ప్ర‌ధాన మంత్రి చెప్పారు.

దీర్ఘ‌కాలం గా నిల‌చిపోయినటువంటి సాగు నీటి పారుదల ప‌థ‌కాల ను పూర్తి చేయ‌డం కోసం ప్ర‌భుత్వం దాదాపు ఒక ల‌క్ష కోట్ల రూపాయ‌ల ను పెట్టుబ‌డి గా పెడుతోంద‌ని, దీని తో దేశం లోని అనేక ప్రాంతాల లో రైతుల‌ కు ఘ‌న‌మైన‌టువంటి మ‌రియు చిర‌కాలం నిల‌చిపోయేట‌టు వంటి స‌హాయం అందుతుంద‌ని ఆయ‌న తెలిపారు.  ఆయ‌న త‌న ప్ర‌సంగం లో 17 కోట్ల భూసార కార్డు లు, యూరియా కు వేప పూత‌, 22 పంట‌ల కు ఉత్ప‌త్తి ఖ‌ర్చు కన్నా 50 శాతం వంతున అధిక ఎంఎస్‌ పి, పిఎం ఫ‌స‌ల్ బీమా యోజ‌న‌ మ‌రియు ఇ-ఎన్ఎఎమ్‌ (e-NAM) ప్లాట్ ఫార‌మ్ ల‌ను గూర్చి ప్ర‌స్తావించారు.

రైతులు ప్ర‌స్తుతం కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా 1.60 ల‌క్ష‌ల వ‌ర‌కు రుణాన్ని పొంద‌వ‌చ్చున‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  రైతుల ప్ర‌యోజ‌నం కోసం ఉద్దేశించిన ఇత‌ర సంక్షేమ ప‌థ‌కాల‌ ను గురించి కూడా ఆయ‌న ప్రస్తావించారు.

ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లోని తూర్పు ప్రాంతం అంతా కూడాను శీఘ్ర గ‌తిన ప‌రివ‌ర్త‌న‌ కు లోన‌వుతోంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  ప‌రిశ్ర‌మ‌, సంధానం మ‌రియు ఆరోగ్య రంగాలు ఈ మార్పు కు సాక్షులు గా ఉన్నాయని ఆయ‌న అన్నారు.

గోర‌ఖ్‌పుర్ మరియు ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లోని తూర్పు ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం దాదాపు 10 వేల కోట్ల రూపాయ‌ల విలువైన ప‌థ‌కాలు అయితే ప్రారంభానికి నోచుకోవ‌డ‌మో, లేదా వాటికి సంబంధించిన శంకుస్థాప‌న‌ లు జ‌ర‌గ‌డ‌మో నేడు పూర్తి అయింద‌ని కూడా ఆయ‌న చెప్పారు.  ఈ ప‌థ‌కాలు జీవించ‌డం లో సౌల‌భ్యాన్ని మెరుగుప‌ర‌చ‌నున్నాయ‌ని పేర్కొన్నారు.  పిఎం ఆవాస్ యోజ‌న‌, ఉజ్జ్వ‌ల యోజ‌న‌, ఆయుష్మాన్ భార‌త్ ల వంటి ప‌థ‌కాలు స‌బ్‌కా సాథ్‌- స‌బ్‌కా వికాస్’ స్ఫూర్తి కి ప్ర‌తీక‌లు గా ఉన్నట్లు ఆయ‌న చెప్పారు.