Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పిఎమ్ఒఇండియా వెబ్ సైట్ బహు భాషలలో ప్రారంభం

పిఎమ్ఒఇండియా వెబ్ సైట్ బహు భాషలలో ప్రారంభం


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆధికారిక వెబ్ సైట్ www.pmindia.gov.in ఇప్పుడు బహుభాషలలో పనిచేయడం ప్రారంభించింది. ఈ వెబ్ సైట్ ఇంగ్లిషు, హిందీ లకు తోడు ఇప్పుడు ఆరు ప్రాంతీయ భాషలు.. బెంగాలీ, గుజరాతీ, మలయాళం, మరాఠీ, తమిళం ఇంకా తెలుగు.. లోనూ అందుబాటు లోకి వచ్చింది. ఈ వెబ్ సైట్ ను విదేశ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి సుష్మ స్వరాజ్ ఈ రోజు ఇక్కడ ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తాజా చొరవ.. ప్రజల చెంతకు చేరి వారి సొంత భాషలో వారికి విషయాలను తెలియజేయడానికి ప్రధాన మంత్రి ఎప్పటికప్పుడు చేస్తున్న ప్రయత్నాలలో.. ఒక భాగమన్నారు. తాజా చొరవ.. ప్రజా సంక్షేమానికి, అభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలపై దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు ప్రధాన మంత్రికి మధ్య ప్రభావశీలత్వాన్ని మరింత పెంచగలదన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. వెబ్ సైట్ కు ఇతర ప్రాంతీయ భాషలలో అనువాదం దశల వారీగా లభ్యం కాగలదని కూడా మంత్రి చెప్పారు.

ఆరు ప్రాంతీయ భాషల వెబ్ సైట్ లలోకి ప్రవేశించడం ఈ కింది లంకెల ద్వారా వీలవుతుంది.. :

Bengali:www.pmindia.gov.in/bn
Gujarati:www.pmindia.gov.in/gu
Marathi:www.pmindia.gov.in/mr
Malayalam: www.pmindia.gov.in/ml
Tamil: www.pmindia.gov.in/ta
Telugu: www.pmindia.gov.in/te