పిఎంఇండియా
కేంద్ర మంత్రి శ్రీ చిరాగ్ పాశ్వాన్ రాసిన వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.
భారత్‌లో క్షేత్రస్థాయిలో ఔత్సాహిక పారిశ్రామికరంగాన్ని ముఖ్యంగా మహిళలను సూక్ష్మ ఆహార శుద్ధి రంగం శక్తిమంతం చేస్తోందని ప్రధానమంత్రి అన్నారు. తక్కువ వడ్డీకే రుణాలు, సాంకేతిక పరిజ్ఞానం, బ్రాండింగ్, మార్కెట్ అవకాశాల ద్వారా వ్యాపారాలను పీఎంఎఫ్ఎంఈ పథకం ఎలా చట్టబద్దం చేస్తోందో ఈ వ్యాసం వివరిస్తోందని ఆయన చెప్పారు. అలాగే స్థానిక తయారీదారులను ఉపాధి కల్పించే వారిగా మార్చడానికి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేయడానికి, ఆత్మనిర్భర భారత్‌ను నిర్మించడానికి తోడ్పడుతోందని ఈ కథనం తెలియజేస్తోంది.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి పోస్టు:
‘‘క్షేత్రస్థాయిలో ఔత్సాహిక పారిశ్రామిక రంగాన్ని ముఖ్యంగా మహిళలను భారత సూక్ష్మ ఆహార శుద్ధి రంగం శక్తిమంతం చేస్తోంది. తక్కువ వడ్డీకే రుణాలు, సాంకేతిక పరిజ్ఞానం, బ్రాండింగ్, మార్కెట్ అవకాశాల ద్వారా సంస్థలను పీఎంఎఫ్ఎంఈ పథకం ఎలా చట్టబద్దం చేస్తోందో శ్రీ చిరాగ్ పాశ్వాన్ వివరించారు. ఇది స్థానిక తయారీదారులను ఉపాధి కల్పించే వారిగా మార్చడానికి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేయడానికి, ఆత్మనిర్భర భారత్‌ను నిర్మించడానికి వీలు కల్పిస్తోంది.’’
***
India's micro food processing sector is powering grassroots entrepreneurship, particularly among women. Union Minister Shri @iChiragPaswan highlights how the PMFME Scheme is formalising enterprises through affordable finance, technology, branding and market linkages. It is… pic.twitter.com/iyJe7g1xv2
— PMO India (@PMOIndia) July 21, 2026