పిఎంఇండియా
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం, పునరుత్పాదక ఇంధన రంగంలో 2018 మార్చి 10న కొత్త ఢిల్లీలో ఇండియా ఫ్రాన్స్‌లమధ్య సంతకాలు జరిగిన అవగాహనా ఒప్పందానికి వెనుకటి తేదీతో అమలులోకి వచ్చే విధంగా ఆమోదం తెలిపింది.
ఇండియాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ (ఎన్.ఐ.ఎస్.ఇ)కి, ఫ్రాన్స్‌లోని కమిషరియట్ అ ఎనర్జి అటామిక్ ఎల్ ఆక్స్ ఎనర్జీస్ ఆల్టర్నేటివ్ (సిఇఎ)ల మధ్య పరస్పరం గుర్తించిన రంగాలలో ఇరు పక్షాలూ పరిశోధన, ప్రదర్శన, పైలట్ ప్రాజెక్టులను గుర్తించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. పరస్పర ఒప్పందం ఆధారంగా, ఇరు పార్టీలు ఐఎస్ఎ సభ్య దేశాలలో పైలట్ ప్రాజెక్టుల అమలు, విస్తరణకు కలిసి కృషి చేయనున్నాయి. సంయుక్త పరిశోధన ప్రాజెక్టులు, సంయుక్త పరిశోధన, అభివృద్ధి, సంయుక్త కార్యశాలలు, పరిశోధన సాంకేతిక పరిజ్ఞనాన్ని పరస్పరం అందిపుచ్చుకోవడం, ఆయా రంగాల నిపుణుల మార్పిడి తదితర రంగాలలో పలు విధాలుగా ఉభయ దేశాలు సహకరించుకోనున్నాయి. సమాచార అనుసంధానం, నైపుణ్యాలను ఇచ్చిపుచ్చుకోవడం కూడా ఈ అవగాహనా ఒప్పందం లక్ష్యం.
ఈ అవగాహనా ఒప్పందం ఇరు దేశాల మధ్య పరస్పర సహకారాన్ని బలోపేతం చేయనుంది.
***