Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పురుషుల డ‌బుల్స్ టెనిస్ ఈవెంట్ లో స్వ‌ర్ణాన్ని గెలుచుకొన్న శ్రీ రోహ‌న్ బోప‌న్న, శ్రీ దివిజ్ శ‌ర‌ణ్ ల‌కు అభినంద‌న‌లు తెలిపిన ప్ర‌ధాన మంత్రి


ఇండోనేశియా లోని జ‌కార్తా – పాలెంబాంగ్ లో జరిగిన 18వ ఏశియా గేమ్స్-2018 లో పురుషుల డ‌బుల్స్ టెనిస్ ఈవెంట్ లో స్వ‌ర్ణాన్ని గెలుచుకొన్నందుకు గాను శ్రీ రోహ‌న్ బోప‌న్న, శ్రీ దివిజ్ శ‌ర‌ణ్ ల‌ను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మంత్రి అభినందించారు.

“రోహ‌న్ బోప‌న్న గారు, దివిజ్ శ‌ర‌ణ్ గారు లు మైదానం లోకి అడుగుపెట్టారంటే అద్భుత‌మైన టెనిస్ ఆట కోసం మనం ఎదురుచూడవ‌చ్చు. పురుషుల డ‌బుల్స్ ఈవెంట్ లో వారు స్వ‌ర్ణాన్ని సాధించడం ఎంతో సముచితంగా ఉంది. ఈ క్రీడాకారుల‌కు ఇవే అభినంద‌న‌లు” అని ప్ర‌ధాన మంత్రి త‌న సందేశంలో పేర్కొన్నారు.