Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పురుషుల 10 మీట‌ర్ల ఎయిర్ పిస్ట‌ల్ ఈవెంట్ లో స్వ‌ర్ణాన్ని గెలుచుకొన్న‌ సౌర‌భ్ చౌధ‌రి కి అభినంద‌న‌లు తెలిపిన ప్ర‌ధాన మంత్రి


ఇండోనేశియా లోని జ‌కార్తా- పాలెంబాంగ్ లో జ‌రుగుతున్న 18వ‌ ఏశియ‌న్ గేమ్స్-2018 లో పురుషుల 10 మీట‌ర్ల ఎయిర్ పిస్ట‌ల్ ఈవెంట్ లో స్వ‌ర్ణాన్ని గెలుచుకొన్నందుకు గాను సౌర‌భ్ చౌధ‌రి కి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినంద‌న‌లు తెలిపారు.

“16 ఏళ్ళ వ‌య‌స్సు లో సౌర‌భ్ చౌధ‌రి మ‌న యువ‌త లో నిండివున్న శక్తికి, సామ‌ర్ధ్యానికి ఓ నిద‌ర్శ‌నం. ఏశియ‌న్ గేమ్స్ 2018 లో భాగం గా జ‌రిగిన పురుషుల 10 మీట‌ర్ల ఎయిర్ పిస్ట‌ల్ ఈవెంట్ లో స్వ‌ర్ణ ప‌తకాన్ని ఈ అసాధారణమైన యువ‌కుడు మాతృ దేశానికి సంపాదించి పెట్టాడు. అత‌డికి ఇవే అభినంద‌న‌లు’’ అని ప్ర‌ధాన మంత్రి త‌న సందేశం లో పేర్కొన్నారు.

**