పిఎంఇండియా
గ్లాస్గోలో జరుగుతున్న 2026?కామన్వెల్త్ క్రీడల్లో పురుషుల 80 కిలోల బాక్సింగ్ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన అంకుశ్ పంఘాల్కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
పోటీ మొత్తం అంకుశ్ పంఘాల్ ప్రదర్శించిన అసాధారణ బలం, నైపుణ్యాన్ని ప్రధానమంత్రి ప్రశంసించారు.
అంకుశ్ పంఘాల్ భవిష్యత్ ప్రయాణం మరిన్ని విజయాలతో కొనసాగాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. ఆయన సాధించిన ఈ విజయం మరెందరో యువ బాక్సర్లు అత్యుత్తమ ప్రతిభ కనబరిచేలా స్ఫూర్తినిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
“2026 కామన్వెల్త్ క్రీడల్లో పురుషుల 80 కేజీల బాక్సింగ్ విభాగంలో అంకుష్ పంగాల్ స్వర్ణ పతకం సాధించడం సంతోషంగా ఉంది. ఈ క్రీడలలో ఆయన ప్రదర్శించిన శక్తి, నైపుణ్యం ప్రశంసనీయం. ఆయన భవిష్యత్ ప్రయత్నాలకు శుభాకాంక్షలు. ఈ విజయం మరింతమంది యువ బాక్సర్లు రాణించడానికి స్ఫూర్తినిస్తుంది” అని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో పేర్కొన్నారు.
Proud of Ankush Panghal for winning the Gold Medal in the Men’s 80 kg Boxing category at the 2026 Commonwealth Games. His strength and skill were truly commendable during the games. Best wishes for his upcoming endeavours. May this feat inspire many more young boxers to pursue…
— Narendra Modi (@narendramodi) August 2, 2026