Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పూర్వ రక్షణ శాఖ మంత్రి మరియు నాలుగుసార్లు గోవా కుముఖ్యమంత్రి కీర్తిశేషుడు శ్రీ మనోహర్ పర్రికర్ కు నివాళి గా గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేశనల్ ఎయర్ పోర్ట్ మోపా, గోవా కు ‘మనోహర్ ఇంటర్ నేశనల్ ఎయర్ పోర్ట్ – మోపా, గోవా’అని పేరు పెట్టేందుకు ఎక్స్-పోస్ట్ ఫ్యాక్టో ఆమోదాన్ని ఇచ్చిన మంత్రిమండలి


పూర్వ రక్షణ శాఖ మంత్రి మరియు నాలుగుసార్లు గోవా కు ముఖ్యమంత్రి కీర్తిశేషుడు శ్రీ మనోహర్ పర్రికర్ కు నివాళి గా గ్రీన్ ఫీల్డ్ ఇంటర్ నేశనల్ ఎయర్ పోర్ట్ మోపా, గోవా కు ‘మనోహర్ ఇంటర్ నేశనల్ ఎయర్ పోర్ట్ – మోపా, గోవా’ అని పేరు పెట్టేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఎక్స్-పోస్ట్ ఫ్యాక్టో ఆమోదాన్ని తెలిపింది.

 

గోవా రాష్ట్ర ప్రజల ప్రతిష్టాత్మకమైన ఆకాంక్షల ను నెరవేర్చడానికి గోవా లోని మోపా లో గల క్రొత్త అంతర్జాతీయ విమానాశ్రయాని కి ‘మనోహర్ ఇంటర్ నేశనల్ ఎయర్ పోర్ట్ -మోపా, గోవా’ అని పేరు పెట్టడం కోసం గోవా రాష్ట్ర ప్రభుత్వ మంత్రిమండలి ఏకగ్రీవ నిర్ణయాన్ని తీసుకొందని గోవా ముఖ్యమంత్రి తెలియ జేశారు.

 

గోవా లోని మోపా లో నూతన విమానాశ్రయాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022వ సంవత్సరం డిసెంబర్ లో ప్రారంభించారు. పూర్వం భారత ప్రభుత్వం లో రక్షణ మంత్రి గాను, అలాగే గోవా పూర్వ ముఖ్యమంత్రి గాను సేవలు అందించిన కీర్తి శేషుడు డాక్టర్ మనోహర్ పర్రికర్ ఆధునిక గోవా నిర్మాణం లో అందించినటువంటి తోడ్పాటు కు గుర్తింపు గా ఈ విమానాశ్రయాని కి ఆయన పేరు ను పెట్టడం జరిగింది.

 

***