పిఎంఇండియా
నేడు పోచిషే బోయిషాఖ్ (రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి) సందర్భంగా గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక నివాళులర్పించారు.
గురుదేవ్ ఠాగూర్ అసాధారణ ప్రతిభ కలిగిన రచయిత, ఆలోచనాపరుడు, కవి అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఆయన ఒక గొప్ప తత్వవేత్తగా, విద్యావేత్తగా, కళాకారుడిగా, దేశ నాగరికతా ఆత్మకు కాలాతీత స్వరంగా తనదైన ముద్ర వేశారని కొనియాడారు.
మానవత్వంలోని లోతైన భావోద్వేగాలకు, మన సంస్కృతిలోని అత్యున్నత ఆదర్శాలకు ఆయన ఒక రూపమిచ్చారని శ్రీ మోదీ తెలిపారు. నూతన ఆలోచనలతో, సృజనాత్మక శక్తితో, సాంస్కృతిక విశ్వాసంతో ఆయన మన సమాజాన్ని సుసంపన్నం చేశారని అన్నారు.
దేశం ఠాగూర్‌ను ఎంతో గౌరవంతో, కృతజ్ఞతతో స్మరించుకుంటోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఆయన ఆలోచనలు మన మనసులను నిరంతరం ప్రకాశింపజేయాలని, మన ప్రయత్నాల్లో మార్గదర్శకంగా నిలవాలని ఆశిస్తున్నట్లు చెప్పారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.
‘‘నేడు పోచిషే బోయిషాఖ్ ప్రత్యేక సందర్భంలో గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్‌కు మేం హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాం.
గురుదేవ్ ఠాగూర్ అసాధారణ ప్రతిభ కలిగిన రచయిత, ఆలోచనాపరుడు, కవి. ఆయన ఒక విశిష్టమైన తత్వవేత్తగా, విద్యావేత్తగా, కళాకారుడిగా, దేశ నాగరికతా ఆత్మకు కాలాతీత స్వరంగా తనదైన ముద్ర వేశారు. మానవాళి ప్రగాఢమైన భావోద్వేగాలకు, మన సంస్కృతిలోని అత్యున్నత ఆదర్శాలకు ఆయన ఒక రూపాన్ని ఇచ్చారు. నూతన ఆలోచనలు, సృజనాత్మక శక్తి, సాంస్కృతిక విశ్వాసంతో ఠాగూర్ మన సమాజాన్ని సుసంపన్నం చేశారు.
ఆయన్ను మనం ప్రగాఢమైన భక్తిశ్రద్ధలతో స్మరించుకుందాం. ఠాగూర్ ఆలోచనలు మనసులను ప్రకాశవంతం చేస్తూ, మన ప్రయత్నాలలో మనకు మార్గదర్శకంగా నిలవాలని ఆశిస్తున్నా’’.
Today, on the special occasion of Pochishe Boishakh, we pay our heartfelt tributes to Gurudev Tagore.
— Narendra Modi (@narendramodi) May 9, 2026
Gurudev Tagore was a writer, thinker and poet of extraordinary brilliance. He made a mark as an exceptional philosopher, educationist, artist and a timeless voice of India’s…
আজ, পঁচিশে বৈশাখের এই বিশেষ দিনে, আমরা গুরুদেব ঠাকুরের প্রতি আমাদের অন্তরের শ্রদ্ধা নিবেদন করছি।
— Narendra Modi (@narendramodi) May 9, 2026
গুরুদেব ঠাকুর ছিলেন এক অসাধারণ প্রতিভার অধিকারী সাহিত্যিক, চিন্তক ও কবি। তিনি একজন অনন্য দার্শনিক, শিক্ষাবিদ, শিল্পী এবং ভারতীয় সভ্যতার চিরন্তন কণ্ঠস্বর হিসেবে নিজেকে প্রতিষ্ঠিত…