పిఎంఇండియా
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2015 డిసెంబరు 18 నుంచి 20 వ తేదీ వరకు గుజరాత్ లోని కచ్ జిల్లాలో అధికారిక పర్యటన జరపనున్నారు.
ప్రధాని మొదట భుజ్ కు చేరుకొంటారు. శ్యాంజీ కృష్ణ వర్మ ను ఆయన మరణానంతరం లండన్ లోని ఇన్నర్ టెంపుల్ కు చెందిన ఆనరబుల్ సొసైటీ ‘ బార్ ‘ కు పునర్ నియామకం జరిపినట్లు తెలుపుతూ జారీ చేసిన ధ్రువపత్రాన్ని ప్రధాని గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీమతి ఆనందిబెన్ పటేల్‌కు అందిస్తారు. ఈ ధ్రువపత్రాన్ని ప్రధాన మంత్రి 2015 నవంబరులో యునైటెడ్ కింగ్‌డమ్ ను సందర్శించినప్పుడు, లండన్‌లో అందుకున్నారు.
తరువాత ప్రధాని ఢోర్‌దోకు బయలుదేరి వెళతారు. 18 డిసెంబరు మొదలుకొని 20 డిసెంబరు వరకు ఢోర్‌దో లో జరిగే పోలీస్ డైరెక్టర్స్ జనరల్ సమావేశానికి ప్రధాని హాజరు అవుతారు.