Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రకృతి పట్ల గౌరవం, పర్యావరణాన్ని సంరక్షించడం ముఖ్యం: ప్రధానమంత్రి


ప్రకృతి, పర్యావరణం, సంపూర్ణ విశ్వం పట్ల గౌరవ భావంతో నడుచుకోవడం మన మనుగడకు మూలాధారమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. దేశాన్ని ఆరోగ్యకరంగా, సౌభాగ్యవంతంగా, శక్తిమంతంగా రూపొందించడానికి కృతజ్ఞత‌తోనూ, ప్రకృతిపట్ల నిస్వార్థ సేవ భావంతో ముందుకు రావాలంటూ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.
‘‘
శం నో ద్యావాపృథివీ పూర్వహూతౌ శమన్తరిక్షం దృశ్యే నో అస్తు
శం న ఓషధీర్వనినో భవన్తు శం నో రజసస్పతిరస్తు జిష్ణుః’’ అనే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి పంచుకున్నారు.
సృష్టి ఆరంభం నుంచే మనం పూజనీయంగా భావిస్తున్న ఆకాశం, భూమీ మనకు శుభాలను అందిస్తున్నాయని ఈ సుభాషితం చెబుతోంది. భూమికీ, సూర్యునికీ మధ్య విస్తరించిన చోటు మన జీవితాలకు ప్రయోజనాలను అందించడంతో పాటు మనలో జ్ఞానాన్ని కూడా పెంపొందింప చేయుగాక. అన్ని ఔషధ మొక్కలూ, వన మూలికలూ మనకు ఆరోగ్యాన్నీ, పోషణనీ, సంతోషాన్నీ అందించుగాక. సర్వవ్యాప్తుడూ, విజేతా అయిన దైవం మనకు ఎప్పటికీ సంక్షేమాన్నీ, శాంతినీ, సౌభాగ్యాన్నీ ఇస్తూ ఉండు గాక.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘
ప్రకృతినీ, పర్యావరణాన్నీ, సమస్త సృష్టినీ గౌరవించడం మన మనుగడకు మూలాధారం. రండి.. వీటి పట్ల మనం పూర్తి కృతజ్ఞతనీ, సేవాభావననీ కలిగి ఉంటూ ఆరోగ్యకర, సౌభాగ్యవంత, శక్తిమంత దేశాన్ని నిర్మించడంలో పాలుపంచుకుందాం.
‘‘
శం నో ద్యావాపృథివీ పూర్వహూతౌ శమన్తరిక్షం దృశ్యే నో అస్తు
శం న ఓషధీర్వనినో భవన్తు శం నో రజసస్పతిరస్తు జిష్ణుః’’ అని పేర్కొన్నారు.

 

***