పిఎంఇండియా
ప్రకృతిని రక్షించడంతో పాటు గౌరవించడంలో మానవాళి సంక్షేమం ఇమిడి ఉందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఈ ధర్మసమ్మత జీవన మార్గాన్ని అనుసరించడమే కాకుండా, ప్రకృతితో సద్భావనను కలిగివుంటూ మనుగడ సాగించే స్ఫూర్తిని భారత్ అనాదిగా పాటిస్తున్న సంప్రదాయాలు కూడా మనకు అందిస్తున్నాయని ఆయన అన్నారు.
‘‘లోకపాలాశ్చ తే సర్వే వాసవప్రముఖాస్తథా, రుతవః షట్ చ తే సర్వే మాసాః సంవత్సరాః క్షపాః, దినాని చ ముహూర్తాశ్చ స్వస్తి కుర్వన్తు తే సదా, శ్రుతిః స్మృతిశ్చ ధర్మశ్చ పాతు త్వాం పుత్ర సర్వతః’’ అనే ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి పంచుకున్నారు.
‘ప్రకృతితో సద్భావననీ, ధర్మసమ్మతినీ కలిగి ఉండే జీవన విధానం సంతోషానికీ, భద్రతకీ, శ్రేయానికీ ఆధారంగా నిలుస్తుంది. దిక్కులను సంరక్షించే వారూ, ఇంద్రుని నాయకత్వంలో ప్రముఖ దేవతలూ, ఆరు రుతువులూ, అన్ని నెలలూ, సంవత్సరాలూ, రాత్రులూ, పగళ్లూ, శుభ ఘడియలూ ఎల్లవేళలా ఆశీస్సుల్నీ, సౌభాగ్యాన్నీ అందించు గాక. వేదాలు, పవిత్ర సంప్రదాయాలు, ధర్మబద్ధ నడవడిక.. ఇవి అన్ని కాలాల్లోనూ, అన్ని విధాలుగానూ అందరినీ కాపాడు గాక’ అని ఈ సుభాషితం చెబుతోంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘ప్రకృతిని సంరక్షించడంలో, గౌరవించడంలో మానవ సంక్షేమం ఇమిడి ఉంది. మన సంప్రదాయాలు కూడా ఈ ధర్మసమ్మత ఆచరణకు మొగ్గు చూపే స్ఫూర్తిని మనకు అందిస్తున్నాయి.
‘‘లోకపాలాశ్చ తే సర్వే వాసవప్రముఖాస్తథా, రుతవః షట్ చ తే సర్వే మాసాః సంవత్సరాః క్షపాః, దినాని చ ముహూర్తాశ్చ స్వస్తి కుర్వన్తు తే సదా, శ్రుతిః స్మృతిశ్చ ధర్మశ్చ పాతు త్వాం పుత్ర సర్వతః’’ అని పేర్కొన్నారు.
प्रकृति के संरक्षण और सम्मान में ही मानवता का कल्याण निहित है। हमारी परंपरा भी हमें इसी धर्मसम्मत आचरण की प्रेरणा देती है।
लोकपालाश्च ते सर्वे वासवप्रमुखास्तथा। ऋतवः षट् च ते सर्वे मासाः संवत्सराः क्षपाः॥
दिनानि च मुहूर्ताश्च स्वस्ति कुर्वन्तु ते सदा। श्रुतिः स्मृतिश्च धर्मश्च… pic.twitter.com/oW0CPDnrnP
— Narendra Modi (@narendramodi) July 28, 2026
***************
MJPS/SS/ST