Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానమంత్రికి స్లొవేక్ రిపబ్లిక్ అత్యున్నత జాతీయ పురస్కారం ‘‘ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్, ఫస్ట్ క్లాస్’’ ప్రదానం

ప్రధానమంత్రికి స్లొవేక్ రిపబ్లిక్ అత్యున్నత జాతీయ పురస్కారం  ‘‘ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్, ఫస్ట్ క్లాస్’’ ప్రదానం


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఒక ప్రత్యేక కార్యక్రమంలో స్లొవేకియా అత్యున్నత జాతీయ పురస్కారమైన ది ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్ఫస్ట్ క్లాస్ను ఆ దేశాధ్యక్షులు శ్రీ పీటర్ పెల్లెగ్రినీ ప్రదానం చేశారు.

తనకు విశిష్ట పురస్కారాన్ని ప్రదానం చేసిన స్లొవేకియా అధ్యక్షుడుప్రభుత్వంప్రజలకు ప్రధానమంత్రి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేశారుఈ పురస్కారాన్ని స్వీకరిస్తూ.. ఇది భారతదేశంలోని 1.4 బిలియన్ల మంది ప్రజలకూభారత్స్లొవేకియా మధ్య స్నేహ సంబంధాలకూ దక్కిన గౌరవమన్నారు.

భారత్స్లొవేకియా ప్రజలను ఏకం చేసి ఉంచుతున్న ఆత్మీయతవిశ్వాసంప్రేమకు చిహ్నంగా ఈ పురస్కారాన్ని ప్రధానమంత్రి వర్ణించారురెండు దేశాల్లోని భవిష్యత్తు తరాలు తమ మధ్య ఉన్న ప్రత్యేక స్నేహ సంబంధాన్ని కొనసాగించేలా స్ఫూర్తినిస్తుందని ప్రధానమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

***