పిఎంఇండియా
వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు శ్రీమతి డెల్సీ రోడ్రిగ్జ్ ఈరోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.
ఈ సమావేశం పట్ల ప్రధానమంత్రి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య ఇంధనం, కీలక ఖనిజాలు, సాంకేతికత, వ్యవసాయం, ఆరోగ్యం, ప్రజల మధ్య సంబంధాల విస్తరణలో సహకారాన్ని పెంపొందించుకోవడంపై తాము విస్తృతంగా చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు.
లాటిన్ అమెరికాలో వెనిజులా భారత్ కు విలువైన భాగస్వామి అని పేర్కొన్న శ్రీ మోదీ, ఆ దేశంతో సన్నిహిత సహకారం అభివృద్ధి చెందుతున్న దేశాల కూటమి (గ్లోబల్ సౌత్) కి అత్యంత ప్రాముఖ్యతను కలిగి ఉంటుందని అన్నారు. ఇరు దేశాల ప్రజల పరస్పర ప్రయోజనాల కోసం రెండు దేశాలు కలిసి పనిచేయడం కొనసాగిస్తాయని ప్రధానమంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
“వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు శ్రీమతి డెల్సీ రోడ్రిగ్జ్‌ను కలవడం సంతోషంగా ఉంది. ఇంధనం, కీలక ఖనిజాలు, సాంకేతికత, వ్యవసాయం, ఆరోగ్యం, ప్రజల మధ్య సంబంధాల రంగాలలో సహకారాన్ని విస్తరించడంపై మేం విస్తృతంగా చర్చించాం. లాటిన్ అమెరికాలో విలువైన భాగస్వామిగా వెనిజులాతో భారత్ కు ఉన్న సన్నిహిత సహకారం గ్లోబల్ సౌత్‌కు అత్యంత ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇరు దేశాల ప్రజల పరస్పర ప్రయోజనాల కోసం మేం కలిసి పనిచేయడం కొనసాగిస్తాం” అని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‘ లో పేర్కొన్నారు.
****
Happy to meet with the Acting President of Venezuela, Ms. Delcy Rodríguez. We had extensive discussions on expanding our cooperation in energy, critical minerals, technology, agriculture, health and people-to-people ties.
— Narendra Modi (@narendramodi) June 4, 2026
As a valued partner in Latin America, our close… pic.twitter.com/TSQJjw50TB