Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానమంత్రి ధన-ధాన్య కృషి యోజన’కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం


2025-26లో ప్రారంభమైఆరేళ్ళ పాటు కొనసాగే ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన” కు

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఈ రోజు ఆమోదం తెలిపింది100 జిల్లాల్లో అమలయ్యే ఈ పథకంనీతీ ఆయోగ్ ఆకాంక్ష జిల్లాల‘ కార్యక్రమం నుంచి స్ఫూర్తి పొందిందివ్యవసాయంఅనుబంధ రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టే తొలి కార్యక్రమం ఇదే కావడం గమనార్హం.

వ్యవసాయ ఉత్పాదకత పెంపు.. పంటల్లో వైవిధ్యం.. పర్యావరణ అనుకూల వ్యవసాయ పద్ధతుల అనుసరణ… పంచాయితీబ్లాక్ స్థాయుల్లో గోదాముల సామర్థ్య పెంపు… పంటలకు సాగునీటి సౌకర్యాల పెంపు…  స్వల్పకాలికదీర్ఘకాలిక రుణ సౌకర్య కల్పన వంటి చర్యల ద్వారా వ్యవసాయఅనుబంధ రంగాల్లో అభివృద్ధిని వేగవంతం చేయాలని పథకం భావిస్తోంది.

2025-26 బడ్జెట్ లో ప్రకటించిన విధంగా ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన” ద్వారా 100 జిల్లాలను అభివృద్ధి పరచడం పథకం లక్ష్యం. 11 విభాగాలకు సంబంధించి… రాష్ట్ర ప్రభుత్వ పథకాలుప్రైవేటు రంగంతో భాగస్వామ్యం ఉన్న పథకాలతో కలిపి ప్రస్తుతం అమల్లో ఉన్న 36 పథకా సమన్వయం ద్వారా పథకం అమలవుతుంది.

తక్కువ దిగుబడులురిమితమైన విస్తరణపరిమితమైన వ్యవసాయ రుణాల పంపిణీ అంశాల ఆధారంగా దేశంలోని 100 జిల్లాలను గుర్తిస్తారుసాగు భూమివ్యవసాయానికి పనికి వచ్చే భూమి విస్తీర్ణం ఆధారంగా ఒక్కో రాష్ట్రంకేంద్రపాలిత ప్రాంతానికి చెందిన జిల్లాల ఎంపిక జరుగుతుందిఅయితేఒక్కో రాష్ట్రం నుంచి కనీసంగా ఒక జిల్లాను కచ్చితంగా పరిగణనలోకి తీసుకుంటారు.

పథకానికి సంబంధించి సమర్థవంతమైన ప్రణాళికలుఆచరణపర్యవేక్షణ కోసం జిల్లారాష్ట్రజాతీయ స్థాయుల్లో కమిటీలు ఏర్పాటవుతాయిస్థానిక అభ్యుదయ రైతులు కూడా భాగమయ్యే జిల్లా ధనధాన్య సమితి…  జిల్లా వ్యవసాయఅనుబంధ రంగాల కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేస్తుందిపంట వైవిధ్యం…  వ్యవసాయ నేలలుసాగు నీటి ఆరోగ్య పరిరక్షణ… వ్యవసాయంఅనుబంధ రంగాల్లో స్వయం సమృద్ధి…  సహజసేంద్రీయ వ్యవసాయ విస్తరణ  జాతీయ లక్ష్యాలతోజిల్లా ప్రణాళికలను అనుసంధానిస్తారుఒక్కో ధనధాన్య జిల్లాలో పథకం సాధించిన అభివృద్ధిని 117 కీలక సూచీల ఆధారంగా నెలవారీ పర్యవేక్షిస్తారుజిల్లా ప్రణాళికలను నీతీ ఆయోగ్ కూడా సమీక్షించి మార్గనిర్దేశనం చేస్తుందిఅంతేకాకపథకం పురోభివృద్ధిని ప్రతి జిల్లాకు నియమితులైన కేంద్ర ప్రభుత్వ నోడల్ అధికారులు క్రమం తప్పక సమీక్షిస్తారు.  

100 జిల్లాల నిర్దేశిత లక్ష్యాలు మెరుగవడంతోమొత్తం దేశానికి కీలక సూచీల ఆధారంగా లెక్కించే ప్రగతి  కూడా పెరుగుదల నమోదు చేస్తుందిఈ పథకం ద్వారా అధిక దిగుబడులువ్యవసాయఅనుబంధ రంగాలకు విలువ జోడింపుస్థానికంగా ఉపాధి అవకాశాల కల్పనతద్వారా దేశీయోత్పత్తి  పెంపుస్వయం సమృద్ధి (ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంసాధ్యపడతాయిఎంపిక చేసిన వంద జిల్లాల్లో సూచీలు మెరుగుదల కనపరిస్తేసహజంగానే జాతీయ సూచీల్లో కూడా ఎదుగుదల కనిపిస్తుంది.

 

****