పిఎంఇండియా
|
1. |
భూభౌతిక అన్వేషణ రంగంలో సహకారంపై అవగాహన ఒప్పందం (ఎంఓయూ) |
ఈ అవగాహన ఒప్పందం అధునాతన భూభౌతిక l, కృత్రిమ మేధ సాంకేతికతలను ఉపయోగించి ఖనిజ అన్వేషణలో భారత్-ఇజ్రాయెల్ సహకారాన్ని పెంపొందిస్తుంది; అలాగే సమాచార మార్పిడి, పెట్టుబడులు, స్థిరమైన వనరుల అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. |
|
2. |
గుజరాత్‌లోని లోథల్‌లో నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ (ఎన్హెచ్ఎంసీ) అభివృద్ధి కోసం అవగాహన ఒప్పందం |
ఈ అవగాహన ఒప్పందం ప్రదర్శనలు, పరిశోధనలు, ప్రచురణలు, నైపుణ్యాల మార్పిడి ద్వారా ఉమ్మడి సముద్ర వారసత్వాన్ని చాటిచెప్పడానికి భారత్-ఇజ్రాయెల్ సహకారాన్ని ప్రోత్సహిస్తుంది; తద్వారా నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ అభివృద్ధికి, ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడానికి మద్దతునిస్తుంది. |
|
3. |
2026-2029 కాలానికి సంబంధించి సాంస్కృతిక మార్పిడి కార్యక్రమం |
ఈ సాంస్కృతిక మార్పిడి కార్యక్రమం (సీఈపీ) సంగీతం, నాటకం, దృశ్య కళలు, నృత్యం, ఇతర సృజనాత్మక రంగాలలో ఉత్సవాలు, వర్క్‌షాప్‌లు, నిపుణుల పర్యటనల ద్వారా భారత్-ఇజ్రాయెల్ సాంస్కృతిక సంబంధాలను పెంపొందిస్తుంది; తద్వారా ఇరు దేశాల మధ్య పరస్పర అవగాహనను మరింతగా పటిష్టం చేస్తుంది. |
|
4. |
ఇజ్రాయెల్‌లో యూపీఐని అమలు చేయడం కోసం ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ (ఎన్ఐపీఎల్), ఇజ్రాయెల్ కు చెందిన ఎంఏఎస్హెచ్ఏవీ మధ్య అవగాహన ఒప్పందం |
ఈ అవగాహన ఒప్పందం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ద్వారా భారత్, ఇజ్రాయెల్ మధ్య సీమాంతర నగదు బదిలీలను సులభతరం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. |
|
5. |
భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) ఇజ్రాయెల్ లోని ఎంఏఎస్హెచ్ఏవీ మధ్య ‘భారత్-ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ సెంటర్ ఫర్ అగ్రికల్చర్’ (ఐఐఎన్సీఏ) స్థాపనపై అవగాహన ఒప్పందం |
ఈ అవగాహన ఒప్పందం ఐసిఎఆర్ లో ఒక ఉమ్మడి ఆవిష్కరణ కేంద్రం ఏర్పాటును ప్రతిపాదిస్తుంది. ఇది ప్రెసిషన్ ఫార్మింగ్, ఉపగ్రహ ఆధారిత నీటి పారుదల, అధునాతన యంత్రాలు, సమగ్ర తెగుళ్ల నివారణ వంటి తదుపరి తరం వ్యవసాయ సాంకేతికతలను అభివృద్ధి చేయడమే కాకుండా; జెర్మ్‌ప్లాజం మార్పిడి, క్షేత్రస్థాయి ప్రదర్శనలు, పంట అనంతర పరిష్కారాలు, సామర్థ్య పెంపునకు మద్దతునిస్తుంది. |
|
6. |
హారిజన్ స్కానింగ్ రంగంలో సహకారంపై ఉద్దేశ్య ప్రకటన
|
ఈ ఉద్దేశ్య ప్రకటన (డీఓఐ) ఉమ్మడి పరిశోధన, సామర్థ్య పెంపుదల, ఏఐ ఆధారిత పరికరాల ద్వారా వ్యూహాత్మక దూరదృష్టి, ముప్పుల అంచనా, సాంకేతిక ప్రణాళికను బలోపేతం చేయడానికి, అధునాతన ‘హారిజన్ స్కానింగ్’ రంగంలో భారత్-ఇజ్రాయెల్ సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. |
|
7. |
మత్స్య సంపద, ఆక్వాకల్చర్ రంగంలో సహకారంపై అవగాహన ఒప్పందం |
ఈ అవగాహన ఒప్పందం పరిశోధన, అభివృద్ధి, వాణిజ్యం, శిక్షణ, ఆవిష్కరణలు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్థాపన ద్వారా అధునాతన వ్యవస్థలు, వ్యాధి నియంత్రణ, మ్యారికల్చర్ (సముద్ర జీవుల పెంపకం) సముద్రపు పాచి వంటి రంగాలను కలుపుకొని స్థిరమైన, సాంకేతిక ఆధారిత మత్స్య సంపద, ఆక్వాకల్చర్‌లో భారత్-ఇజ్రాయెల్ సహకారాన్ని మెరుగుపరుస్తుంది. |
|
8. |
ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ (ఐఎఫ్ఎస్సీఏ), ఇజ్రాయెల్ సెక్యూరిటీస్ అథారిటీ (ఐఎస్ఏ) మధ్య అవగాహన ఒప్పందం |
ఇది సమాచార మార్పిడి, ఉత్తమ విధానాలు, ఫిన్‌టెక్, రెగ్‌టెక్ సహకారం, కీలక రంగాల పరిణామాల తాజా సమాచారం ద్వారా ఆవిష్కరణల ఆధారిత వ్యవస్థను పెంపొందించడానికి ఆర్థిక సేవలలో సహకారాన్ని పెంపొందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. |
|
9. |
వాణిజ్య, సేవల రంగాలలో కార్మిక చలనశీలత అమలుకు ప్రోటోకాల్ |
ఈ ప్రోటోకాల్, రిటైల్, క్లీనింగ్, రవాణా, వేర్‌హౌసింగ్ (గిడ్డంగి), ఫుడ్ ప్రాసెసింగ్, ఆతిథ్యం, రీసైక్లింగ్ వంటి రంగాలలో నియంత్రిత మార్గాల ద్వారా భారతీయ కార్మికులు ఇజ్రాయెల్‌లో ఉపాధి పొందేందుకు వీలు కల్పిస్తుంది. |
|
10. |
తయారీ రంగంలో కార్మిక చలనశీలత అమలుకు ప్రోటోకాల్ |
ఈ ప్రోటోకాల్ టెక్స్టైల్స్ (వస్త్రాలు), లోహాలు, ఎలక్ట్రానిక్స్, రసాయనాలు, ఆహార శుద్ధి, కలప, కాగితం, ప్లాస్టిక్స్, రబ్బరు, ఇతర పారిశ్రామిక రంగాలతో సహా వివిధ తయారీ పరిశ్రమలలో నియామకాలను కవర్ చేస్తుంది. |
|
11. |
రెస్టారెంట్ రంగంలో కార్మిక చలనశీలత అమలుకు ప్రోటోకాల్ |
ఇది రెస్టారెంట్లు, కేఫ్‌లు, ఇతర ఆహార తయారీ, విక్రయ వ్యాపారాలలో నియామకాలను కవర్ చేస్తుంది. |
|
12. |
కృత్రిమ మేధ వినియోగం ద్వారా విద్యను పెంపొందించడంలో సహకారంపై అవగాహన ఒప్పందం |
సమ్మిళిత, భవిష్యత్ కు సిద్ధంగా ఉండే విద్య కోసం వినూత్న బోధనా పద్ధతులు, ఉపాధ్యాయుల అభివృద్ధి, నియంత్రణ వ్యవస్థలు, అందరికీ సమానంగా అందుబాటులో ఏఐ, పరిశోధన మార్పిడి, ఏఐ, డేటా అనుసంధానం సహా ఏఐ ఆధారిత, మానవ కేంద్రీకృత అభ్యాసాన్ని అభివృద్ధి చేయడంపై ఈ ఒప్పందం దృష్టి పెడుతుంది. |
|
13. |
ఇజ్రాయెల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కమర్షియల్ ఆర్బిట్రేషన్ (ఐఐసీఏ), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఆర్బిట్రేషన్ (ఐసీఏ) మధ్య సహకార ఒప్పందం |
ఈ ఒప్పందం విజ్ఞాన మార్పిడి, ఉత్తమ పద్ధతులు, ఉమ్మడి శిక్షణ ద్వారా ఆర్బిట్రేషన్ (మధ్యవర్తిత్వం), మీడియేషన్ రంగాలలో సహకారాన్ని ప్రోత్సహిస్తుంది; తద్వారా ఇరు దేశాలలో ఈ రంగాలకు సంబంధించిన నైపుణ్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది. |
|
14. |
4వ భారత్-ఇజ్రాయెల్ సీఈఓ ఫోరమ్ నివేదిక సమర్పణ. |
నాలుగవ సీఈఓల ఫోరమ్ నవంబర్ 2025లో ఇజ్రాయెల్‌లో జరిగింది దీనికి సంబంధించిన ఉమ్మడి నివేదికను ఇరు ప్రభుత్వాలకు సమర్పించారు. ఈ నివేదిక, పరిశ్రమల ధోరణులకు అనుగుణంగా ప్రభుత్వ విధానాలను రూపొందించడానికి, ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి, పటిష్టమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి అవసరమైన విశ్లేషణలను, సిఫార్సులను అందిస్తుంది |
|
15. |
నలంద విశ్వవిద్యాలయం, జెరూసలేంలోని హీబ్రూ విశ్వవిద్యాలయం (హెచ్యూజేఐ) మధ్య అవగాహన ఒప్పందం |
ఈ అవగాహన ఒప్పందం బౌద్ధ అధ్యయనాలు, పురావస్తు శాస్త్రం, గణితం, అంతర్జాతీయ సంబంధాలతో సహా పలు విభాగాలలో రెండు విశ్వవిద్యాలయాల మధ్య అధ్యాపకులు, విద్యార్థుల మార్పిడి కోసం ఒక కార్యాచరణను ఏర్పాటు చేస్తుంది. |
|
16. |
భారతదేశంలో ‘భారత్-ఇజ్రాయెల్ సైబర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ ఏర్పాటుకు సంబంధించిన లెటర్ ఆఫ్ ఇంటెంట్ |
ఈ లెటర్ ఆఫ్ ఇంటెంట్ సైబర్ సెక్యూరిటీలో ఉత్తమ పద్ధతులు, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, డిజిటల్ సుస్థిరతను ప్రదర్శించడానికి భారతదేశంలో ఒక ఉమ్మడి సైబర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేస్తుంది; తద్వారా ప్రభుత్వం, పరిశ్రమలు, విద్యాసంస్థల మధ్య సహకారాన్ని పెంపొందిస్తుంది. |
|
17. |
కృత్రిమ మేధ రంగంలో సహకారంపై అవగాహన ఒప్పందం |
ఈ అవగాహన ఒప్పందం కృత్రిమ మేధ అభివృద్ధి, సామర్థ్య పెంపుదలలో సహకారాన్ని ప్రోత్సహిస్తుంది; ఇది నైతిక ఏఐ, పౌర రంగాలు, విద్యా పరిశోధనలలో దీని వినియోగానికి, అలాగే సుస్థిర వృద్ధి కోసం ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాలకు మద్దతునిస్తుంది. |
వరస నెం. | ఎంఓయూ/ ఒప్పందం | వివరాలు |
|---|
ప్రకటనలు
1.రెండు దేశాల మధ్య సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచడం
2. సైన్స్, టెక్నాలజీపై జరిగే జాయింట్ కమిటీ సమావేశాన్ని మంత్రిత్వ స్థాయికి పెంచడం
3. జాతీయ భద్రతా సలహాదారుల నేతృత్వంలో కీలక, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాల భాగస్వామ్యం
4. రెండు దేశాల మధ్య ఆర్థిక చర్చలు
5. టెక్-గేట్‌వే చొరవ
6. వ్యవసాయ రంగంలో పరిశోధనలను ప్రోత్సహించడానికి 20 ఉమ్మడి ఫెలోషిప్ లు
7. ఉమ్మడి పరిశోధన పిలుపుల కోసం ఇరుపక్షాల నుంచి విరాళాలను లేదా నిధులను పెంచడం
8. వచ్చే 5 ఏళ్లలో 50,000 మంది వరకు భారతీయ కార్మికులకు కోటా కల్పించడం
9. భారత్-ఇజ్రాయెల్ అకడమిక్ కోఆపరేషన్ ఫోరమ్
10. భారత్ – ఇజ్రాయెల్ పార్లమెంటరీ మైత్రీ బృందం
***
PM @narendramodi and PM @netanyahu held extensive discussions and announced to elevate India-Israel ties to a Special Strategic Partnership.
— PMO India (@PMOIndia) February 26, 2026
The leaders agreed to strengthen cooperation in trade and emerging technologies, including the launch of a Critical and Emerging… pic.twitter.com/zEdRdvBWYs
Today’s discussions with PM Netanyahu were very fruitful. We’ve taken a historic decision to elevate our time-tested partnership to a Special Strategic Partnership. This decision reflects the aspirations of the people of both countries.@netanyahu pic.twitter.com/zXJr2re3Mb
— Narendra Modi (@narendramodi) February 26, 2026
We discussed giving new direction and greater momentum to our cooperation. This includes economic and trade linkages. We have decided to establish a Critical and Emerging Technologies Partnership. This will accelerate cooperation in many futuristic areas.
— Narendra Modi (@narendramodi) February 26, 2026
Agriculture is a key area where India and Israel are working closely. In today’s talks, it was decided to increase the number of Centres of Excellence to 100. This will greatly benefit farmers.
— Narendra Modi (@narendramodi) February 26, 2026
הדיונים היום עם ראש הממשלה נתניהו היו פוריים מאוד. קיבלנו החלטה היסטורית להעלות את השותפות המוכחת שלנו ל'שותפות אסטרטגית מיוחדת'. החלטה זו משקפת את שאיפותיהם של אזרחי שתי המדינות.@netanyahu pic.twitter.com/Wc6CPkzoPS
— Narendra Modi (@narendramodi) February 26, 2026
דנו במתן כיוון חדש ומומנטום רב יותר לשיתוף הפעולה שלנו. זה כולל קשרים כלכליים ומסחריים. החלטנו להקים 'שותפות לטכנולוגיות קריטיות ומתפתחות'. זה יאיץ את שיתוף הפעולה בתחומים עתידניים רבים.
— Narendra Modi (@narendramodi) February 26, 2026
חקלאות היא תחום מפתח שבו הודו וישראל עובדות בשיתוף פעולה הדוק. בשיחות היום הוחלט להגדיל את מספר 'מרכזי המצוינות' ל 100. הדבר יועיל רבות לחקלאים.
— Narendra Modi (@narendramodi) February 26, 2026