Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో జపాన్‌ రక్షణ మంత్రి భేటీ


భారత్‌లో అధికారిక పర్యటన సందర్భంగా నేడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో జపాన్‌ రక్షణశాఖ మంత్రి షింజిరో కొయిజుమి సమావేశమయ్యారు.

జూలై 2026లో జరిగిన 16వ భారత్‌జపాన్‌ వార్షిక శిఖరాగ్ర సమావేశం కోసం భారత్‌కు వచ్చిన జపాన్‌ ప్రధాని సనాయి తకైచీతో తాను జరిపిన విస్తృత చర్చలను ప్రధాని శ్రీ మోదీ గుర్తు చేసుకున్నారుభారత్‌జపాన్‌ మధ్య రక్షణ సహకారం నిరంతరం బలోపేతం అవుతున్న తీరును ఆయన ప్రశంసించారు.

భారత్‌జపాన్‌ మధ్య ప్రత్యేక వ్యూహాత్మకప్రపంచ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలన్న తన దార్శనికతను ప్రధానమంత్రి వివరించారుఇండోపసిఫిక్‌ ప్రాంతంతో పాటు ఇతర ప్రాంతాల్లో శాంతిస్థిరత్వంశ్రేయస్సును పెంపొందించేందుకు ఇరు దేశాల మధ్య రక్షణభద్రతా సహకారం ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు.

‘మేక్‌ ఇన్‌ ఇండియా’ కార్యక్రమం కింద రక్షణ రంగంలో భారతీయ కంపెనీలుఅంకుర సంస్థలతో సహ అభివృద్ధిసహ ఉత్పత్తి కోసం జపాన్‌ భాగస్వామ్యానికి ఉన్న అవకాశాలను ప్రధాని వివరించారు.

ద్వైపాక్షిక రక్షణ సహకారంలో సాధించిన పురోగతిని ప్రధానమంత్రికి రక్షణ మంత్రి కొయిజుమి వివరించారుభారత్‌తో సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు జపాన్‌ ప్రభుత్వం నిరంతరం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.