Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన (పీఎం-ఎస్ఎస్‌వై)కు కేబినెట్ ఆమోదం


ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన (పీఎంఎస్ఎస్‌వైపథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందిఇంధన నిల్వ వ్యవస్థల (ఈఎస్ఎస్సదుపాయంతో కూడిన తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టుల (ఎఫ్ఎస్‌పీవీఅభివృద్ధికి ఉద్దేశించిన పథకమిదిమొత్తం రూ. 5,070 కోట్లను ఇందుకోసం కేటాయించనున్నారుప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

5,000 మెగావాట్ల తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఈ పథకం లక్ష్యంగా పెట్టుకుందికనీసం రెండు గంటల నిల్వ సామర్థ్యం (అంటే 10,000 మెగావాట్స్ అవర్కలిగిన ఇంధన నిల్వ వ్యవస్థలనూ వీటితోపాటే ఏర్పాటు చేస్తారుఈ ప్రాజెక్టులకు 2026-27 నుంచి 2030-31 మధ్య ఆమోదం లభిస్తుంది. 2032-33 వరకు నిధుల పంపిణీ కొనసాగుతుంది.

జాతీయ సౌర శక్తి సంస్థ ఇటీవలి అంచనాల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారుదేశంలోని జలాశయాలుఇతర అనువైన నీటి వనరుల ద్వారా.. తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టుల నుంచి దాదాపు 102.18 జీడబ్ల్యూపీ మేర సౌర విద్యుత్తును ఉత్పత్తి చేసే అవకాశం ఉందని ఈ సంస్థ అంచనా వేసింది.

అర్హత కలిగిన ప్రతీ తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టూ విజయవంతంగా ప్రారంభమైన అనంతరం.. మెగావాట్‌కు రూకోటి చొప్పున కేంద్ర ఆర్థిక సాయాన్ని ఈ పథకం కింద అందిస్తారుదీనితోపాటు సాధ్యాసాధ్యాల అధ్యయనం కోసం ప్రతి ప్రాజెక్టుకు రూ. 50 లక్షల వరకు సాయం లభిస్తుందిఇందులో భాగంగా నీటి లోతు (బాతిమెట్రీ), జలచిత్రణ (హైడ్రోగ్రఫీపరీక్షలుపర్యావరణ అధ్యయనాలుప్రాజెక్టు అభివృద్ధిలో ఆటంకాలను తగ్గించడానికి అవసరమైన ఇతర సన్నాహక కార్యకలాపాలను చేపడతారు.

అన్ని రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలకు ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూరుతుందిప్రస్తుతం దేశంలో తేలియాడే సౌర విద్యుత్ సామర్థ్యం 700 మెగావాట్లు మాత్రమే ఉండగా.. ఈ పథకం ద్వారా అది 5,000 మెగావాట్లకు పెంచుతుందిప్రస్తుతమున్న జలాశయాలుపారిశ్రామిక నీటి నిల్వలను సమర్థంగా వినియోగించుకోవడానికి ఈ ప్రాజెక్టులు దోహదపడతాయిఅలాగే కొరతగా ఉన్న భూ వనరుల విషయంలో పోటీనీ తగ్గిస్తాయిఇంధన నిల్వ వ్యవస్థను అనుసంధానించడం గ్రిడ్ విశ్వసనీయతనుస్థిరత్వాన్ని పెంచడంలో దోహదపడుతుందిఏటా దాదాపు 10 మిలియన్ టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలను తగ్గించడంలో ఈ పథకం సహాయపడుతుందిప్రాజెక్టుకు సంబంధించి అన్ని దశల్లోనూ కలిపి దాదాపు 16,000 నుంచి 17,000 మందికి పూర్తిస్థాయి ఉపాధి అవకాశాలు లభిస్తాయినీటిపై తేలియాడే వ్యవస్థలతోపాటు.. సౌర విద్యుత్ ఫలకాలుమాడ్యూళ్లువిద్యుత్ నిల్వ వ్యవస్థల వంటి ప్రాజెక్టుకు సంబంధించి ప్రతి దశలోనూ దేశీయ తయారీని కూడా ఈ పథకం ప్రోత్సహిస్తుందితద్వారా ఆత్మనిర్భర భారత్ సంకల్పానికి ఊతమిస్తుంది.

ఈ పథకం పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి దోహదపడడమే కాకుండా దేశ విద్యుత్పర్యావరణ లక్ష్యాలను చేరుకోవడంలోనూ సాయపడుతుందివికసిత భారత్ లక్ష్యాన్ని ముందకు తీసుకెళ్తూ.. జల వనరులను సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సాహాన్నిస్తుంది.  

***