Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానిని కలిసిన శ్రీరామ్ కామర్స్ కాలేజీ పాలక మండలి సభ్యులు


శ్రీరామ్ కామర్స్ కాలేజీ పాలక మండలి సభ్యుల ప్రతినిధి బృందం ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిసిందివిద్యాపరమైన ఉన్నతిదేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తూ ముందుకు సాగుతున్న సంస్థకు ఈ ఏడాదితో వందేళ్లు పూర్తవుతున్నాయనీసంస్థ విశిష్ట ప్రస్థానంలో ఇదొక కీలకమైన మైలురాయి అనీ శ్రీ మోదీ వ్యాఖ్యానించారుఉన్నత విద్యారంగానికి కళాశాల దీర్ఘకాలిక సేవలనూతరతరాలుగా విభిన్న రంగాల్లో నిపుణులను తీర్చిదిద్దడంలో సంస్థ పాత్రను ఆయన కొనియాడారు.

శ్రీరామ్ కామర్స్ కాలేజీ శత వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఒక స్మారక తపాలా స్టాంపును కూడా ఈ సందర్భంగా విడుదల చేశారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

‘‘దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ఒకటైన శ్రీరామ్ కామర్స్ కాలేజీ పాలక మండలి ప్రతినిధి బృందాన్ని కలిశానుఈ ఏడాది సంస్థ వందో వార్షికోత్సవాన్ని జరుపుకొంటున్నాంఈ సందర్భంగా ఒక స్మారక స్టాంపును కూడా విడుదల చేశాంసంస్థకు నా శుభాకాంక్షలు.’’ 

 ***