Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధాని శ్రీ నరేంద్ర మోదీకి ‘ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో’ అత్యున్నత జాతీయ పురస్కారం

ప్రధాని శ్రీ నరేంద్ర మోదీకి ‘ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో’ అత్యున్నత జాతీయ పురస్కారం


పోర్ట్ ఆఫ్ స్పెయిన్లోని అధ్యక్ష భవనంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ట్రినిడాడ్ అండ్ టొబాగో అత్యున్నత జాతీయ పురస్కారం ‘‘ది ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో’’ను ఆ దేశ అధ్యక్షురాలు గౌరవ క్రిస్టీన్ కార్లా కంగలూ ఓఆర్‌టీటీ ప్రధానం చేశారు. ఆయన రాజనీతి, గ్లోబల్ సౌత్ ప్రాధాన్యాలకు మద్దతు, భారత్, ట్రినిడాడ్ అండ్ టొబాగో మధ్య సంబంధాలను బలోపేతానికి చేసిన అసాధారణ కృషికిగాను ఈ పురస్కారాన్ని అందించారు. దీన్ని స్వీకరించిన తొలి విదేశీయుడిగా ప్రధాని నిలిచారు.

1.4 బిలియన్ల మంది భారతీయుల తరఫున ఈ పురస్కారాన్ని ప్రధానమంత్రి స్వీకరించారు. అలాగే రెండు దేశాల మధ్య చిరకాలంగా కొనసాగుతున్న స్నేహబంధానికి ఈ గౌరవాన్ని అంకితం చేశారు. ఈ ప్రత్యేక సంబంధాలు 180 ఏళ్ల క్రితం ఈ దేశానికి వచ్చిన భారతీయుల ఉమ్మడి చరిత్ర, సాంస్కృతిక వారసత్వంపై ఆధారపడి ఉన్నాయని పేర్కొన్నారు. భారత్, ట్రినిడాడ్ అండ్ టొబాగో మధ్య ఉన్న ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం పట్ల తన నిబద్దతను తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధాని గౌరవ కమ్లా ప్రెసాద్ బిసెసా, ఆమె మంత్రి వర్గంలోని సభ్యులు, పార్లమెంటు సభ్యులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

 

***