పిఎంఇండియా
భారతదేశ రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ ఈ రోజు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా శ్రీ మోదీకి తన శుభాకాంక్షలతో పాటు హార్దిక శుభకామనలను కూడా తెలియజేశారు.
రాష్ట్ర పతి తమ సందేశంలో “ మీ పుట్టిన రోజు నాడు నా హృదయపూర్వక శుభకామనలను, అలాగే శుభాకాంక్షలను దయచేసి స్వీకరించండి.
మీ జీవనంలోను, అలాగే మన దేశ జీవనంలోను మరింత గొప్పవైన విజయాలను కొనితేగల నూతన సంవత్సరానికి ఈ రోజున నాంది జరుగు గాక.
మరిన్ని సంవత్సరాల పాటు దేశానికి మీరు సమర్పణ భావంతో సేవ చేసేందుకు అనువుగా మీకు చక్కని ఆరోగ్యాన్ని, సంతోషాన్ని ఈశ్వరుడు ప్రసాదించు గాక ” అని అభిలషించారు.
I thank Honourable Rashtrapati ji for his kind birthday greetings. @RashtrapatiBhvn
— Narendra Modi (@narendramodi) September 17, 2016