Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధాన మంత్రికి ముత్యాలలో త‌యారుచేసిన క‌ళాకృతి ప్ర‌దానం

ప్రధాన మంత్రికి ముత్యాలలో త‌యారుచేసిన క‌ళాకృతి ప్ర‌దానం


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీకి ముత్యాల‌తో రూపొందించిన ఒక అద్వితీయ‌ క‌ళాకృతిని ఈ రోజు ప్ర‌దానం చేశారు. ఇందులో భార‌త‌దేశం చిత్ర‌ప‌టంతో పాటు ప్ర‌ధాన మంత్రి బొమ్మ కూడా ఉంది.

5 ల‌క్ష‌ల‌కు పైగా ముత్యాల‌ను ఉప‌యోగించి ఈ క‌ళాకృతిని తీర్చిదిద్దిన‌ట్లు ఈ బొమ్మ‌ను త‌యారు చేసిన ఖుశ్ బూ ఆకాశ్ దావ్‌డా వివ‌రించారు. అంతేకాకుండా 10 కిలో మీట‌ర్ల పొడ‌వైన దారాన్ని కూడా వాడారు. 7 అడుగులు పొడుగు, 7 అడుగులు వెడ‌ల్పుతో ఉన్న ఈ క‌ళాకృతిని త‌యారు చేయ‌డానికి 850 గంట‌లు ప‌ట్టింది.

రాజ్ కోట్ పార్ల‌మెంటు స‌భ్యుడు శ్రీ మోహ‌న్ భాయ్ కున్ ద‌రియా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

*****