పిఎంఇండియా
రెండ్రోజుల భారత పర్యటన నిమిత్తం వచ్చిన మెక్సికో విదేశాంగ మంత్రి క్లాడియా రూయిజ్-మాసియు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ తో భేటీ అయ్యారు. న్యూయార్క్‌లో 2015 సెప్టెంబరులో జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభ (యూఎన్‌జీఏ) సందర్భంగా మెక్సికో అధ్యక్షుడు నైతోతో జరిగిన సమావేశంలో చర్చించిన సానుకూల అంశాలను గుర్తుచేశారు. శక్తి, తయారీ, మౌలికవసతులు, అభివృద్ధి, పట్టణీకరణ-పట్టణ ప్రణాళిక, శాస్త్ర సాంకేతిక, అంతరిక్ష ప్రయోగాలు, వ్యవసాయం, ఆరోగ్యం, సాంప్రదాయ ఔషధాల రంగంలో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతంపై ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు.
ఈ రంగాల్లో భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి చాలా ఆసక్తిగా ఉన్నట్లు మెక్సికో విదేశాంగ మంత్రి తెలిపారు. మెక్సికో పర్యటనకు రావాలని ఆ దేశాధ్యక్షుడు తరపున ఆమె ప్రధాని మోదీని ఆహ్వానించారు.
Mexico's Foreign Minister @ruizmassieu called on PM @narendramodi. pic.twitter.com/7CEg2pPWyJ
— PMO India (@PMOIndia) March 11, 2016