Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రపంచ వినియోగదారు హక్కుల దినం సందర్భంగా వినియోగదారుకు వందనం చేసిన ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రపంచ వినియోగదారు హక్కుల దినం సందర్భంగా వినియోగదారుకు వందనం చేశారు. డిజిటల్ లావాదేవీలను అవలంభించవలసిందిగా విజ్ఞప్తి చేశారు.

“ప్రపంచ వినియోగదారు హక్కుల దినం నాడు వినియోగదారుకు ఇదే నా ప్రణామం. వినియోగదారుల కొనుగోలు శక్తి మీదనే మన ఆర్థిక వ్యవస్థ వృద్ధి ఆధారపడుతోంది.

వినియోగదారు హక్కులను కాపాడే అనేక కార్యక్రమాలను అమలుపరచడంలోను, వారి ఫిర్యాదులు పరిష్కారం అయ్యేటట్లు చూడటంలోను భారత ప్రభుత్వం ముందు భాగంలో నిలిచింది.

డిజిటల్ లావాదేవీలను అవలంభించవలసిందిగాను, అవినీతికి, నల్లధనానికి స్వస్తి పలికే ఉద్యమంలో భాగస్వాములు అవ్వాల్సిందిగాను ప్రపంచ వినియోగదారు హక్కుల దినాన్ని పురస్కరించుకొని వినియోగదారులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.

***