Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రభుత్వ అధినేతగా దేశసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలిపిన మాజీ రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్ కోవింద్‌కు ప్రధానమంత్రి కృతజ్ఞతలు


దేశసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలిపిన మాజీ రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్ కోవింద్ కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. “భారత్‌లో చోటుచేసుకుంటున్న మార్పులు, ముఖ్యంగా పేదలు, అణగారిన వర్గాల ప్రజల జీవితాల్లో వస్తున్న మార్పులపై ఆయన చేసిన వ్యాఖ్యలు నాకు ఎంతో ప్రత్యేకమైనవి. ఇప్పటివరకు సాధించినదంతా 140 కోట్ల మంది భారతీయుల సమష్టి సంకల్పానికి ఫలితం” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.

 

“మాజీ రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్ కోవింద్ జీ అందించిన శుభాకాంక్షలు, ఆప్యాయతతో కూడిన మాటలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. భారత్ అంతటా చోటుచేసుకుంటున్న మార్పులు, ముఖ్యంగా పేదలు, అణగారిన వర్గాల ప్రజల జీవితాల్లో వస్తున్న మార్పులపై ఆయన చేసిన వ్యాఖ్యలు నాకు ఎంతో ప్రత్యేకమైనవి. ఇప్పటివరకు సాధించినదంతా 140 కోట్ల మంది భారతీయుల సమష్టి సంకల్పానికి ఫలితమే” అని శ్రీ మోదీ సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‘ లో పేర్కొన్నారు. 

***