Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రభుత్వ కొనుగోళ్లలో జీఈఎమ్ తెచ్చిన మార్పులపై కేంద్ర మంత్రి వ్యాసం… ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి


ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మార్కెట్‌ప్లేస్ (జీఈఎమ్వేదిక ఇప్పటి వరకు సాధించిన విజయాలను సమగ్రంగా వివరిస్తూ కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్ రాసిన వ్యాసాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారుపారదర్శక కొనుగోళ్లువిస్తృత భాగస్వామ్యంమెరుగైన అవకాశాలను మంత్రి తన వ్యాసంలో ప్రస్తావిస్తూప్రభుత్వ కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి మార్పులను జీఈఎమ్ తీసుకువస్తోందో తెలియజేశారు.

సాంకేతికతను వినియోగించుకోవడానికి జీఈఎమ్ వేదిక గత 10 సంవత్సరాలుగా ప్రాధాన్యాన్ని ఇస్తూ మరింత ఎక్కువ పోటీపడగలిగేసమ్మిళత విస్తారిత అనుబంధ వ్యవస్థను ఆవిష్కరించి వాణిజ్య సౌలభ్యాన్ని బలోపేతం చేసిందని ప్రధానమంత్రి అన్నారుసూక్ష్మచిన్నమధ్యతరహా పరిశ్రమలకూఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు జీఈఎమ్ సాధికారతను కల్పిస్తోందని ఆయన అన్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:

‘‘పారదర్శక కొనుగోళ్లు, విస్తృత భాగస్వామ్యంతో పాటు మెరుగైన అవకాశాలు.. ఈ విధంగా ప్రభుత్వ కొనుగోళ్ల ప్రక్రియలో @GeM_India మార్పుచేర్పులను తీసుకువస్తోంది.

సాంకేతికతకు ప్రాధాన్యాన్ని ఇస్తూగత పది సంవత్సరాల్లో మరింత ఎక్కువగా పోటీపడగలుగుతున్నసమ్మిళిత విస్తారిత అనుబంధ వ్యవస్థను జీఈఎమ్ వేదిక ఆవిష్కరించి వాణిజ్య సౌలభ్యాన్ని పెంపొందించిందిఎమ్ఎస్ఎమ్ఈలకూఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకూ సాధికారతను కల్పిస్తోంది.

ఇప్పటి వరకూ సాధించిన విజయాల్ని సమగ్రంగా వివరిస్తూ కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్ రాసిన వ్యాసాన్ని చదవగలరు’’ అని పేర్కొన్నారు.

 

***