Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్ర‌ణాళిక‌ రచన రంగంలో స‌హ‌కారానికి భారతదేశం, సింగ‌పూర్‌ లు కుదుర్చుకున్న ఎంఒయు కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం


పట్టణ ప్ర‌ణాళిక‌ రచన, అభివృద్ధి ల రంగంలో ప‌ర‌స్ప‌ర స‌హ‌కారం కోసం  భారతదేశం, సింగ‌పూర్‌ లు కుదుర్చుకున్న అవ‌గాహ‌నపూర్వక ఒప్పందానికి (ఎంఒయు కు) ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివర్గం ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో ఆమోదాన్ని తెలిపింది. ఈ ఎంఒయు పై 2018 మే 31 న సంత‌కాలు జ‌రిగాయి. 

కేంద్ర రాష్ట్ర‌ప్ర‌భుత్వ సంస్థలు, మ్యునిసిప‌ల్ సంస్థ‌లు న‌గ‌రాభివృద్ధి నిర్వ‌హ‌ణ ఇత‌ర రంగాల‌కు సంబంధించి సింగ‌పూర్ సంస్థ‌ల నైపుణ్యాల‌ను అందుబాటు లోకి తెచ్చుకోవ‌డానికి వీలు క‌ల్పించ‌డం త‌ద్వారా న‌గ‌రాభివృద్ధి రెజువినేష‌న్‌ కు, మిశన్‌కు తోడ్పాటును అందించ‌డం ఈ ఎంఒయు ప్ర‌ధానోద్దేశం.  ఇది ఎన్‌ఐటిఐ లో సామ‌ర్ధ్యాల నిర్మాణానికి వీలు క‌ల్పిస్తుంది.  అలాగే  ఆధారాల‌తో కూడిన ఆచ‌ర‌ణాత్మ‌క విధానాల ర‌చ‌న‌కు, ప‌రిశీల‌న‌కు అవ‌స‌ర‌మైన నైపుణ్యాల‌ను అధికారులకు క‌ల్పించ‌డానికి ఇది తోడ్ప‌డుతుంది.  ఆ ర‌కంగా ఎన్‌ఐటిఐ త‌న‌కు అప్ప‌గించిన నూత‌న పాత్ర అయిన మేధో మ‌థ‌న వ్య‌వ‌స్థ‌ గా మ‌రింత స‌మ‌ర్ధంగా ప‌నిచేయ‌డానికి వీలు క‌లుగుతుంది.

ఈ ఎంఒయు లో భాగంగా, ప్రణాళిక రచన రంగంలో సామ‌ర్ధ్యాల నిర్మాణం, అర్బ‌న్ ప్లానింగ్‌ పై దృష్టి, నీరు, మురుగుపారుద‌ల వ్య‌వ‌స్థ‌ల నిర్మాణం, ఘ‌న వ్య‌ర్థాల నిర్వ‌హ‌ణ‌, మంచి ర‌వాణా వ్య‌వ‌స్థ‌, ప‌బ్లిక్ ఫైనాన్సింగ్‌ (ప‌బ్లిక్‌,ప్రైవేట్ భాగ‌స్వామ్యం) వంటి వాటిని చేప‌ట్ట‌డం జ‌రుగుతుంది.

కీల‌క‌ ప్ర‌భావం:

మెరుగైన విధానాల‌కు సంబంధించిన స‌మాచారాన్ని అందించ‌డం, సామ‌ర్ద్యాల నిర్మాణం, కేంద్ర‌,రాష్ట్ర‌ ప్ర‌భుత్వాల స్థాయిలో న‌గ‌రాభివృద్ధి, నీరు, మురుగునీటిపారుద‌ల నిర్వ‌హ‌ణ‌,  ఘ‌న‌ వ్య‌ర్థాల నిర్వ‌హ‌ణ‌, మెరుగైన ర‌వాణా వ్య‌వ‌స్థ‌, ప‌బ్లిక్ ఫైనాన్సింగ్ (ప‌బ్లిక్ ప్రైవేట్ భాగ‌స్వామ్యం) త‌దిత‌ర రంగాల‌లో ప్ర‌భుత్వ సంస్థల‌కు గ‌ట్టి మ‌ద్ద‌తును ఇవ్వ‌డం వంటి వాటికి ఈ ఎంఒయు ఉప‌క‌రిస్తుంది.

ల‌బ్దిదారులు:

కేంద్ర‌, రాష్ట్ర‌ప్ర‌భుత్వాల అధికారులు, న‌గ‌ర ప్రాంతాలకు చెందిన స్థానిక సంస్థ‌ల అధికారులు త‌మ ప‌రిజ్ఞాన స్థాయి ని పెంచుకునేందుకు ప్ర‌త్య‌క్షంగా ఇది ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇది అంతిమంగా న‌గ‌రాల‌లో పౌర సేవ‌లు స‌దుపాయాలు మెరుగుప‌డ‌డానికి దోహ‌ద‌ప‌డుతుంది.

***