Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్ర‌ధానికి స‌రికొత్త సూచ‌న‌లు, భావ‌న‌ల‌ను ఆవిష్క‌రించిన ప్ర‌భుత్వ కార్య‌ద‌ర్శులు

ప్ర‌ధానికి స‌రికొత్త సూచ‌న‌లు, భావ‌న‌ల‌ను ఆవిష్క‌రించిన   ప్ర‌భుత్వ కార్య‌ద‌ర్శులు


భార‌త ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీతో శుక్రవారం ప్ర‌భుత్వ కార్య‌దర్శులు స‌మావేశ‌మై కీల‌కాంశాల‌పై త‌మ మ‌నోగ‌తాల‌ను ఆవిష్క‌రించారు. ప్ర‌ధాని సూచ‌న‌ల మేర‌కు భార‌త ప్ర‌భుత్వ కార్య‌ద‌ర్శులు రెండు గ్రూపులుగా విడిపోయి వివిధ కీల‌కాంశాల‌పై త‌మ సూచ‌న‌లు, భావ‌న‌ల‌ను ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు వివ‌రించారు.(ఏ) స‌రికొత్త‌గా బ‌డ్జెట్ రూప‌క‌ల్ప‌న‌, దాని అమ‌లు, (బి) స్వ‌చ్ఛ భార‌త్‌, గంగా న‌ది శుద్ధి అన్న రెండు కీల‌కాంశాల‌పై నూత‌న ఆలోచ‌న‌ల‌ను ప్ర‌ధానితో పంచుకున్నారు. ఇది వ‌ర‌కు నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో భాగంగా కొత్త ఆలోచ‌న‌ల ఆవిష్క‌ర‌ణ‌ కార్య‌క్ర‌మం మ‌రో పర్యాయం ప్ర‌ధాని, ప్ర‌భుత్వ కార్య‌ద‌ర్వుల మ‌ధ్య జ‌రిగింది.కేంద్ర మంత్రులు శ్రీ రాజ్‌నాథ్‌సింగ్‌, శ్రీ అరుణ్ జైట్లీ, శ్రీమ‌తి సుష్మా స్వ‌రాజ్‌, శ్రీ మ‌నోహ‌ర్ పారిక్క‌ర్‌తో పాటు ప్ర‌భుత్వ కార్య‌ద‌ర్శులు ఈ స‌మావేశంలో పాల్గొన్నారు. కార్య‌ద‌ర్శుల ప్ర‌జెంటేష‌న్ల స‌మ‌యంలో ప్ర‌ధానితో పాటు ప‌లువురు కేంద్ర మంత్రులు త‌మ సందేహాలు, ప్ర‌శ్న‌లను కార్య‌ద‌ర్శుల‌కు సంధించారు. ప్ర‌భుత్వ కార్య‌ద‌ర్శుల స‌రికొత్త ఆలోచ‌న‌లు మ‌రింత మెరుగ్గా ఉండేందుకు త‌మ సూచ‌న‌ల‌ను అందించారు.ఈ ఏడాది జ‌న‌వ‌రి 12న ఇంధ‌న పొదుపు, సామ‌ర్థ్యం అన్న అంశంపై మొద‌టి గ్రూపు కార్య‌ద‌ర్శులు ప్ర‌ధాన మంత్రి, కేంద్ర మంత్రుల ముందు ప్ర‌జెంటేష‌న్ ఇచ్చారు.