Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్ర‌ధానితో ఆఫ్ఘ‌నిస్థాన్ అధ్య‌క్షుడు శ్రీ అష్రాఫ్ ఘ‌ని టెలిఫోన్ సంభాష‌ణ‌


ప‌ఠాన్ కోట్ లో జ‌రిగిన ఉగ్ర దాడికి ఖండ‌న‌

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీతో ఆఫ్ఘ‌నిస్థాన్ అధ్య‌క్షుడు శ్రీ అష్రాఫ్ ఘ‌ని టెలిఫోన్ లో మాట్లాడారు. ప‌ఠాన్ కోట్ లో జ‌రిగిన సీమాంత‌ర ఉగ్రవాద దాడిని ఈ సంద‌ర్భంగా ఆయ‌న తీవ్రంగా ఖండించారు. దాడిలో జ‌రిగిన ప్రాణ న‌ష్టం ప‌ట్ల సంతాపం తెలిపారు. మ‌జారే ష‌రీఫ్ లో జ‌రిగిన తీవ్ర‌వాదుల దాడిని గురించి కూడా ప్ర‌ధానికి అధ్య‌క్షుడు శ్రీ ఘ‌ని వివ‌రించారు. భార‌త‌దేశంలో భూకంపం వ‌చ్చి ఆస్తి న‌ష్టం, ప్రాణ న‌ష్టం జ‌రిగినందుకు శ్రీ ఘ‌ని సంతాపం తెలియ‌జేశారు. భారత్ కు అండగా నిలుస్తామన్నారు.

దీనిపై అధ్య‌క్షుడు శ్రీ ఘ‌ని స్పంద‌న‌కు ప్ర‌ధాని ధ‌న్య‌వాదాలు ప‌లికారు. మ‌జారే ష‌రీఫ్ పై తీవ్ర‌వాదుల దాడిని భ‌గ్నం చేయ‌డంలో ఆఫ్ఘాన్ నేష‌న‌ల్‌ సెక్యూరిటీ ఫోర్సెస్ చూపిన అసాధార‌ణ శౌర్య ప‌రాక్ర‌మాల‌ను ప్ర‌ధాని అభినందించారు. భార‌తీయ దౌత్య కార్యాల‌య భ‌ద్ర‌త‌కు, సిబ్బంది ప్రాణ ర‌క్ష‌ణకు వారు పాటుప‌డ్డార‌న్నారు.

ఆఫ్ఘ‌నిస్థాన్ ప్ర‌జ‌ల‌కు భార‌త‌దేశం ఎల్ల‌ప్పుడూ అండ‌దండ‌లు అందిస్తుంద‌ని ప్ర‌ధాని స్ప‌ష్టం చేశారు.