Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్ర‌ధానితో ఇరాన్ విత్త, ఆర్థిక వ్య‌వ‌హారాల శాఖ మంత్రి భేటీ

ప్ర‌ధానితో ఇరాన్ విత్త, ఆర్థిక వ్య‌వ‌హారాల శాఖ మంత్రి భేటీ

ప్ర‌ధానితో ఇరాన్ విత్త, ఆర్థిక వ్య‌వ‌హారాల శాఖ మంత్రి భేటీ

ప్ర‌ధానితో ఇరాన్ విత్త, ఆర్థిక వ్య‌వ‌హారాల శాఖ మంత్రి భేటీ

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు ఇస్లామిక్ రిప‌బ్లిక్ ఆఫ్ ఇరాన్ విత్త, ఆర్థిక వ్య‌వ‌హారాల శాఖ మంత్రి డాక్ట‌ర్ అలీ త‌య్య‌బ్ నియా కు సాద‌ర స్వాగ‌తం ప‌లికారు. ఈఏఎమ్ స‌హాధ్య‌క్ష‌త వ‌హిస్తున్న ద్వైపాక్షిక సంయుక్త సంఘం స‌మావేశంలో పాల్గొన‌డానికి డాక్ట‌ర్ అలీ త‌య్య‌బ్ నియా భార‌త‌దేశానికి విచ్చేశారు.

ఇరాన్ తో సంబంధాల‌కు భార‌త్ అధిక ప్రాధాన్యం ఇస్తున్న‌ట్లు ప్ర‌ధాన మంత్రి ఈ సంద‌ర్భంగా పేర్కొన్నారు. 2015 జులై లో ఉఫా లో బీఆర్ ఐ సీఎస్ శిఖ‌రాగ్ర స‌మావేశం జ‌రిగిన సంద‌ర్భంలో ఇరాన్ అధ్య‌క్షుడు రౌహానీ తో తాను జ‌రిపిన స‌మావేశం ఫ‌ల‌ప్ర‌దంగా ముగిసింద‌ని ప్ర‌ధాని గుర్తు చేశారు. వ్యాపారం, పెట్టుబ‌డులు, చ‌మురు- గ్యాస్‌, క‌నెక్టివిటీ, నౌకాశ్ర‌యాల అభివృద్ధి వంటి రంగాల‌తో స‌హా ద్వైపాక్షిక సంబంధాల‌ను మ‌రింత‌ ప‌టిష్ట‌ప‌ర‌చుకోవ‌డానికి భార‌త్ సంసిద్ధంగా ఉంద‌ని ప్ర‌ధాని వెల్ల‌డించారు.