పిఎంఇండియా
పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా సెంట్రల్ మిలిటరీ కమిషన్ వైస్ ఛైర్మన్ జనరల్ ఫ్యాన్ చాంగ్‌లాంగ్ బుధవారం భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. భారత్-చైనా సైన్యం మధ్య పెరుగుతున్న బంధం గురించి జనరల్ ఫ్యాన్‌చాంగ్‌లాంగ్ ప్రధానికి వివరించారు. వ్యూహాత్మక విశ్వాసాన్ని పెంచుకోవటంతో పాటు ఇరు దేశాల మధ్య సంబంధాలను పెంపొందించేందుకుగాను సరిహద్దుల్లో శాంతి, సుస్థిరతను కాపాడటం అవసరమని ప్రధాని ఈ సందర్భంగా అన్నారు. భారత్, చైనా మధ్య సైనిక సహకారాన్ని బలోపేతం చేసేందుకు తీసుకుంటున్న చర్యలను ప్రధానమంత్రి శ్రీ మోదీ స్వాగతించారు. వచ్చే ఏడాది భారత్‌లో జరిగే అంతర్జాతీయ ఫ్లీట్ రివ్వ్యూలో పీఎల్ఏ నావికాదళం పాల్గొనబోతుండటాన్ని ప్రధానమంత్రి స్వాగతించారు.
Met Gen. Fan Changlong, Vice-Chairman of Central Military Commission of China. https://t.co/fTivnSYJAX pic.twitter.com/HZjmfiycgp
— Narendra Modi (@narendramodi) November 17, 2015