పిఎంఇండియా
నేతాజీ సుభాష్ చంద్ర బోస్ బంధువులైన మాధురీ బోస్, చంద్ర బోస్ లు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో బుధవారం సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మాధురీ బోస్ తాను రచించిన పుస్తకం “ద బోస్ బ్రదర్స్ అండ్ ఇండియన్ ఇండిపెండెన్స్ – యాన్ ఇన్‌సైడర్స్ అకౌంట్” ప్రతిని ప్రధానికి అందజేశారు.
ఈ పుస్తకాన్ని ప్రచురించిన సేజ్ పబ్లికేషన్స్ ప్రతినిధి శ్రీ వివేక్ మెహ్రా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.