Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్ర‌ధాన మంత్రి కి ఫోన్ చేసి అభినందనలు తెలిపిన ఫ్రెంచ్ అధ్యక్షుడు


ఫ్రాన్స్ అధ్యక్షుడు, శ్రేష్ఠుడు శ్రీ ఇమాన్యుయేల్ మేక్రాన్ 2019వ సంవత్సరం మే నెల 23వ తేదీ న ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తో టెలిఫోన్ లో మాట్లాడి, ఎన్నికల లో విజయం సాధించినందుకు అభినందనలు తెలిపారు.

భారతదేశానికి, ఫ్రాన్స్ కు మధ్య గల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశ గా కలసి కృషి చేయాలన్న తమ వచనబద్ధత ను ఇరువురు నేతలూ ఈ సందర్భం గా పునరుద్ఘాటించారు. కీలక అంశాల లో భారతదేశానికి దృఢమైన మద్దతు ను అందిస్తూవస్తున్నందుకు ఫ్రాన్స్ కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు.

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ని ప్రజాస్వామిక ప్రపంచంలోని అగ్రగామి నాయకులలో ఒకరు గా అధ్యక్షుడు శ్రీ మేక్రాన్ అభివర్ణిస్తూ, ఒక ద్వైపాక్షిక సమావేశం కోసం 2019వ సంవత్సరం ఆగస్టు నెల లో ఫ్రాన్స్ ను సందర్శించాలని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ని మరో మారు ఆహ్వానించారు. అలాగే, బయారిట్జ్ లో జి7 శిఖర సమ్మేళనానికి కూడా హాజరు కావలసిందిగా శ్రీ మోదీ ని శ్రీ మేక్రాన్ కోరారు.

******