పిఎంఇండియా
ఆస్ట్రేలియా ప్రధాని మాన్య శ్రీ స్కాట్ మారిసన్ 2019వ సంవత్సరం, మే నెల 23 వ తేదీన టెలిఫోన్ ద్వారా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో సంభాషించారు. శ్రీ మోదీ 17వ లోక్ సభ సాధారణ ఎన్నికల లో సాధించిన విజయాని కి గాను శ్రీ మారిసన్ ఆయన కు అభినందన లు తెలిపారు.
ఆస్ట్రేలియా తో భారతదేశాని కి ఉన్న సంబంధాల ను మరింత పటిష్ట పరచుకొనేందుకు భారతదేశం ఎంతో ప్రాముఖ్యాన్ని ఇస్తోందని ప్రధాన మంత్రి ఈ సందర్భం గా ప్రస్తావించారు. భారతదేశం, ఆస్ట్రేలియా లు రెండూ కూడాను శక్తిమంతమైనటువంటి మరియు చైతన్యశీలమైనటువంటి ప్రజాస్వామ్య దేశాలు అని శ్రీ మోదీ చెప్తూ, అంతకంతకూ విస్తరిస్తున్న ఆర్థిక కార్యక్రమాల తోను, ఉన్నత స్థాయి సమావేశాల తోను, అలాగే ఇనే దేశాల ప్రజల మధ్య నెలకొన్న బలమైన సంబంధాల తోను మన సంబంధాలలో చోటు చేసుకొన్న వేగ గతి ఇక ముందు కూడా మరింతగా దూసుకుపోగలుగుతుందన్నారు.
అలాగే, ప్రధాన మంత్రి ఇటీవలే ఆస్ట్రేలియా లో ముగిసిన ఎన్నికల లో ప్రధాని శ్రీ మారిసన్ తన లిబరల్-నేశనల్ కోఅలిశన్ పార్టీ ని గెలుపు దిశ గా పయనించేటట్లు ఆ పార్టీ కి మార్గదర్శకత్వాన్ని నెరపినందుకు శ్రీ మారిసన్ కు అభినందన లు తెలిపారు. భారతదేశాన్ని సందర్శించడానికి రావలసిందంటూ ఆయన ప్రధాని శ్రీ మారిసన్ కు తన ఆహ్వానాన్ని పునరుద్ఘాటించారు.