Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్ర‌ధాన మంత్రి తో స‌మావేశ‌మైన యుఎస్ విదేశీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి శ్రీ మైక‌ల్ పోమ్పెయో


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తో యుఎస్ విదేశ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి శ్రీ మైక‌ల్ ఆర్. పోమ్పెయో ఈ రోజు ఉద‌యం స‌మావేశమ‌య్యారు.

ప్ర‌ధాన మంత్రి ఎన్నిక‌ల లో సాధించిన విజ‌యం ప‌ట్ల అధ్య‌క్షుడు శ్రీ ట్రంప్ త‌ర‌ఫు న అభినంద‌న‌ల ను మంత్రి శ్రీ పోంపెయో ప్ర‌ధాన మంత్రి కి అంద‌జేశారు. అలాగే, ఆయ‌న‌ కు అభినంద‌న‌ లను కూడా తెలిపారు.

మంత్రి శ్రీ పోమ్పెయో త‌న కు ఆత్మీయ అభినంద‌న‌ల‌ ను తెలిపినందుకు ప్ర‌ధాన మంత్రి ధ‌న్య‌వాదాలు ప‌లికారు. అంతేకాకుండా, త‌న‌కు శుభాకాంక్ష‌ల ను అందజేసినందుకుగాను అధ్య‌క్షుడు శ్రీ ట్రంప్ కు త‌న ధ‌న్య‌వాదాల‌ ను తెలియ‌జేయ‌వ‌ల‌సింది గా కూడా ఆయ‌న అభ్య‌ర్ధించారు.

యుఎస్ తో సంబంధాల కు తాను ఇస్తున్న‌టువంటి ప్రాథమ్యాన్ని ప్ర‌ధాన మంత్రి పున‌రుద్ఘాటించారు. ఉమ్మ‌డి ప్రయోజనాల ను, విశ్వాసాల ను బలోపేతం చేసుకోవడాన్ని గురించి మరియు ప్ర‌భుత్వం యొక్క నూతన ప‌ద‌వీకాలం లోను, ఆ త‌రువాత కూడాను వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యం తాలూకు తన దార్శనికత ను గురించి ఆయన ఈ సంద‌ర్భం గా వివరించారు.

భార‌త‌దేశం తో బ‌ల‌వ‌త్త‌ర‌మైన సంబంధాల ను నిర్మించుకోవ‌డం లో, అలాగే ఉమ్మ‌డి ల‌క్ష్యాల ను మ‌రియు ఉమ్మ‌డి దార్శ‌నిక‌త ను ఆచ‌ర‌ణ లోకి తీసుకొని రావ‌డం లో యుఎస్ ప్రభుత్వం నిరంతరం ఆసక్తి చూపుతూ ఉంటుందని మంత్రి శ్రీ పోంపెయో చెప్పారు.

వ్యాపారం, ఆర్థిక వ్య‌వ‌స్థ‌, శ‌క్తి , ర‌క్ష‌ణ‌, ఉగ్ర‌వాదం పై పోరాటం మ‌రియు ప్ర‌జ‌ల కు ప్ర‌జ‌ల‌ కు మధ్య సంబంధాలు.. ఈ రంగాల లో ద్వైపాక్షిక సంబంధాల‌ ను పూర్తి స్థాయి కి చేర్చి ఫ‌లితాల ను అందుకోవాలన్న తన బ‌ల‌మైన చిత్త‌శుద్ధి ని ప్ర‌ధాన మంత్రి వెల్ల‌డి చేశారు.