పిఎంఇండియా
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో జపాన్ యొక్క నేశనల్ సెక్యూరిటీ సెక్రటేరియట్ (ఎన్ఎస్ఎస్) సెక్రటరీ జనరల్ శ్రీ శిగెరు కీతముర ఈ రోజు న సమావేశమయ్యారు.
2019వ సంవత్సరం, సెప్టెంబర్ లో శ్రీ కీతముర పదవీ బాధ్యతల ను స్వీకరించిన తరువాత భారతదేశాన్ని మొట్టమొదటి సారి సందర్శిస్తున్న సందర్భం లో ప్రధాన మంత్రి ఆయన కు స్వాగతం పలికారు. ఈ ప్రాంతం లో శాంతి, ప్రగతి మరియు భద్రత ల పరిరక్షణ కు గాను రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం వర్ధిల్లుతూ ఉండడం ఎంతైనా ముఖ్యం అని ప్రధాన మంత్రి నొక్కి వక్కాణించారు. భారతదేశం యొక్క జాతీయ భద్రత సలహాదారు తో శ్రీ కీతముర జరిపే చర్చ లు ద్వైపాక్షిక సహకారం తాలూకు ఈ కీలక అంశాన్ని బలోపేతం చేసేందుకు బాట ను వేయగలవన్న విశ్వాసాన్ని ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు.
ప్రధాని శ్రీ ఆబే తో తనకు ఉన్న ఆప్యాయభరిత స్నేహాన్ని ప్రధాన మంత్రి ఈ సందర్భం గా గుర్తు కు తెస్తూ, వచ్చే నెల లో జరుగనున్న భారత్- జపాన్ వార్షిక శిఖర సమ్మేళనాని కి శ్రీ ఆబే ను భారతదేశం లోకి ఆహ్వానించడం కోసం తాను వేచివున్నట్లు పేర్కొన్నారు.