పిఎంఇండియా
మాన్య శ్రీ భూటాన్ ప్రధాని మరియు నా మిత్రుడు డాక్టర్ శెరింగ్,
ప్రముఖ అతిథులు,
మహిళలు మరియు సజ్జనులారా,
అభినందనలు,
భారతదేశానికి ఒక ఆత్మీయమైనటువంటి మరియు ప్రత్యేకమైనటువంటి భూటాన్ లో, ఇక్కడ మీ అందరి నడుమ ఉన్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. నాకు మరియు నా ప్రతినిధి వర్గాని కి ఎంతో ఆదరంతో కూడినటువంటి స్వాగతాన్ని పలికినందుకుగాను ప్రధాని గారూ, మీకు మరియు రాయల్ గవర్నమెంట్ ఆఫ్ భూటాన్ కు నేను మనసారా ధన్యవాదాల ను తెలియ జేస్తున్నాను.
ఎక్స్‌లెన్సీ,
భారతదేశం-భూటాన్ మధ్య విశిష్టమైన మిత్రత్వం విషయం లో మీరు చూపిస్తున్నటువంటి ఔదార్య భరితమైన అభిప్రాయాల కు కూడాను నేను నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞత ను వ్యక్తం చేస్తున్నాను. 130 కోట్ల మంది భారతీయుల మనస్సుల లో భూటాన్ కు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నది. నా గత పదవీ కాలం లో ప్రధాన మంత్రి గా నేను తొలి పర్యటన ను జరపడానికి భూటాన్ ను ఎంపిక చేసుకోవడం స్వాభావికం. ఈ మారు కూడాను నా యొక్క రెండో పదవీ కాలం ఆరంభం లో భూటాన్ ను సందర్శించడం నాకు చాలా ఆనందాన్ని ఇస్తోంది. భారతదేశాని కి, భూటాన్ కు మధ్య ఉన్న సంబంధాలు ఉభయ దేశాల ప్రజల పురోగతి, సమృద్ధి, ఇంకా భద్రత ల తాలూకు ఉమ్మడి ప్రయోజనాల పైన ఆధారపడ్డాయి. ఈ కారణం గా వాటి కి ఇరు దేశాల లోనూ ప్రజల వైపు నుండి సంపూర్ణమైనటువంటి మద్ధతు లభిస్తున్నది.
ఎక్స్‌లెన్సీ,
ఈ సంబంధాల ను మరింత బలోపేతం చేయడం కోసం మీ తో, భూటాన్ రాజు గారి తో, కలసి పని చేసే అవకాశాన్ని భారతదేశం ప్రజలు మరో సారి వారి నిర్ణయాత్మకమైన ప్రజాతీర్పు ద్వారా నాకు అందజేయడం నా భాగ్యం. మన భాగస్వామ్యాన్ని గురించి భూటాన్ రాజు గారి తో చర్చించేందుకు ఈ రోజు న నాకు అవకాశం దక్కింది. మరి కొద్దిసేపటి తరువాత నేను భూటాన్ యొక్క నాలుగో రాజు గారి తోనూ భేటీ అవుతాను. భూటాన్ రాజు ల యొక్క వివేకం మరియు దూర దృష్టి మన ద్వైపాక్షిక సంబంధాల కు దీర్ఘ కాలం గా మార్గదర్శకత్వాన్ని ప్రసాదిస్తూ వచ్చాయి. ఇవి ఒక్కటే కాదు, వారి యొక్క దార్శనికత భూటాన్ తో పాటు యావత్తు ప్రపంచాని కి విశిష్టమైన ఉదాహరణ గా నిలచింది. అది ఎటువంటిది అంటే, అభివృద్ధి ని సంఖ్య ల ద్వారా కాక సంతోషం ద్వారా కొలవడం అనేదే. ఎక్కడైతే ఆర్థికాభివృద్ధి పర్యావరణం తో, సంప్రదాయం తో భుజం భుజం కలిపి నడుస్తుందో ఆ తరహా మిత్రుడి ని మరియు పొరుగు దేశాన్ని ఎవరు మాత్రం కోరుకోరు గనుక.
మిత్రులారా,
భూటాన్ యొక్క అభివృద్ధి లో మేము ఒక ప్రధానమైటువంటి భాగస్వామ్య దేశం గా ఉండడం భారతదేశాని కి లభించినటువంటి ఒక ప్రత్యేకాధికారం. భూటాన్ యొక్క పంచవర్ష ప్రణాళికల లో భారతదేశం సహకారం మరింత గాఢతరం గా కొనసాగుతుంది.
మిత్రులారా,
జల విద్యుత్తు అనేది మన రెండు దేశాల మధ్య ఒక ముఖ్యమైన సహకార క్షేత్రం గా ఉంది. ఈ రెండు దేశాలు కూడా భూటాన్ యొక్క నదుల శక్తి ని కలసికట్టు గా మార్చివేసి, పరస్పర సౌభాగ్యాని కి వినియోగించాయి. ఈ రోజు న మనం ఈ ప్రయాణం లో మరొక చరిత్రాత్మకమైనటువంటి మైలురాయి ని అందుకొన్నాము. అదే మాంగ్‌దేఛూ పథకం యొక్క ప్రారంభోత్సవం. రెండు దేశాల సహకారం తో భూటాన్ లో జల విద్యుత్తు ఉత్పాదన సామర్ధ్యం 2000 ఎండబ్ల్యు ను అధిగమించింది. ఇతర ప్రోజెక్టుల ను కూడా శర వేగం గా ముందుకు తీసుకు పోతామన్న నమ్మకం నాలో ఉంది.
ఎక్స్‌లెన్సీ,
భూటాన్ లోని సామాన్య ప్రజానీకం యొక్క పెరుగుతున్న అవసరాల ను తీర్చడం కోసం భారతదేశం నుండి ఎల్‌పిజి సరఫరా ను ఒక్కో నెల కు 700 ఎంటి నుండి 1000 ఎంటి కి పెంచడం జరుగుతోంది. ఇది పల్లెల కు శుభ్రమైన ఇంధనాన్ని అందించడం లో సహాయకారి అవుతుంది.
మిత్రులారా,
మా ఒకటో సమావేశం లో డాక్టర్ శెరింగ్ నాతో ఏమని చెప్పారంటే, సామాన్య మానవుడి కి చక్కని ఆరోగ్య సేవల ను అందజేయాలన్నదే రాజకీయాల లోకి ప్రవేశించేందుకు తనకు ప్రధానమైన ప్రేరణ గా నిలచింది అని. ఆయన దార్శనికత నాకు చాలా నచ్చింది. భూటాన్ లో బహుళ విభాగాల తో కూడిన సూపర్ స్పెశాలిటీ హాస్పిటల్ ను ఆవిష్కరించాలన్న ఆయన యొక్క కల ను పండించడం లో భారతదేశం సాధ్యమైన అన్ని రకాలుగాను సహాయపడుతుంది.
ఎక్స్‌లెన్సీ,
ఎస్ఎఎఆర్‌సి కరెన్సీ స్వాప్ ఫ్రేమ్ వర్క్ లో భాగం గా భూటాన్ కోసం కరెన్సీ మార్పిడుల యొక్క పరిమితి ని పెంచడానికి మేము సుముఖం గా ఉన్నాము. మరో ప్రక్క విదేశీ మారక ద్రవ్యం ఆవశ్యకత ను తీర్చడం కోసం స్టాండ్ బై స్వాప్ అగ్రిమెంట్ లో భాగం గా భూటాన్ కు అదనం గా 100 మిలియన్ డాలర్ నిధుల ను అందుబాటు లోకి తీసుకు రావడం జరుగుతుంది.
మిత్రులారా,
అంతరిక్ష సాంకేతిక విజ్ఞానాన్ని వినియోగించి భూటాన్ యొక్క అభివృద్ధి ని వేగవంతం చేయడం కోసం భారతదేశం వచన బద్ధురాలై ఉంది. మనము ఈ రోజు న దక్షిణ ఆసియా ఉపగ్రహం యొక్క భూతల కేంద్రాన్ని ఆరంభించుకొన్నాము. ఇది భూటాన్ లో ప్రకృతి విపత్తుల నిర్వహణ, కమ్యూనికేశన్ మరియు పబ్లిక్ బ్రాడ్-కాస్టింగ్ ల యొక్క పరిధి ని విస్తృతం చేయనుంది. ఈ ఉద్దేశాల ను నెరవేర్చుకోవడం కోసం భూటాన్ యొక్క అవసరాల కు అనుగుణం గా అదనపు బ్యాండ్ విడ్త్ ను మరియు ట్రాన్స్‌పాండర్ లను కూడా అందుబాటు లోకి తీసుకు రావడం జరుగుతుంది. చిన్న ఉపగ్రహాల నిర్మాణం లో మరియు అంతరిక్ష సాంకేతిక విజ్ఞానం వినియోగం లో కూడా రెండు దేశాలు సహకరించుకోనున్నాయి. భారతదేశం యొక్క నేశనల్ నాలిజ్ నెట్ వర్క్ తో ఏర్పడే సంధానం భూటాన్ పరిశోధకుల ను మరియు విద్యార్థుల ను భారతదేశ విశ్వవిద్యాలయాల కు చెందిన నూతన వనరుల తో జోడిస్తుంది. ఉభయ దేశాల మధ్య ఒక ఉమ్మడి విజ్ఞాన సంఘం స్థాపన లో ఇది ఒక ముఖ్యమైన అడుగు గా మారుతుంది. దీని ద్వారా ప్రధానం గా మన యువతీ యువకుల కు లబ్ధి చేకూరుతుంది. భారతదేశం లోని ఐఐటి లకు మరియు రాయల్ భూటాన్ యూనివర్సిటీ కి మధ్య నెలకొనే సంబంధం మరియు సమన్వయం.. నేటి విద్య, ఇంకా సాంకేతిక విజ్ఞానం సంబంధిత ఆవశ్యకతల కు అనుగుణంగా ఉన్నాయి. ఈ దేశం యొక్క ప్రతిభావంతులైన యువతీ యువకుల ను రేపటి రోజు న రాయల్ భూటాన్ యూనివర్సిటీ లో కలుసుకోవడం కోసం నేను ఎంతో కుతూహలం గా ఎదురుచూస్తున్నాను.
మిత్రులారా,
ఈ రోజు న మనం భూటాన్ లో రూపే కార్డు ను ప్రవేశపెట్టినందుకు నేను చాలా సంతోషం గా ఉన్నాను. ఇది డిజిటల్ పేమెంట్స్ లో, ఇంకా వ్యాపారం మరియు పర్యటకం రంగాల లో మన సంబంధాన్ని మరింత గా ఇనుమడింప చేస్తుంది. మన ఉమ్మడి ఆధ్యాత్మిక వారసత్వం, మరి అలాగే ఇరు దేశాల ప్రజల మధ్య దృఢమైన సంబంధం మన సంబంధాల కు కేంద్ర బిందువు గా ఉన్నాయి. ఈ సంగతి ని దృష్టి లో పెట్టుకొని నాలందా విశ్వవిద్యాలయం లో భూటాన్ కోసం ఉద్దేశించిన స్నాతకోత్తర ఉపకారవేతనాల ను రెండు నుండి అయిదు కు పెంచడం జరుగుతోంది. ఈ రోజు న ఇక్కడ జబ్ డ్రంగ్ యొక్క దీవెనల ను నేను అందుకొన్నాను. భూటాన్ లోని ఈ విశిష్టమైనటువంటి విగ్రహం ఉనికి ని మరొక అయిదు సంవత్సరాల పాటు కొనసాగించేందుకు భారతదేశం సమ్మతించిందని ప్రకటించడాని కి నేను చాలా సంతోషిస్తున్నాను.
ఎక్స్‌లెన్సీ,
భారతదేశం- భూటాన్ సంబంధాల చరిత్ర దాని ఉజ్వల భవిత మాదిరి గానే భవ్యమైనటువంటిది. ప్రపంచం లో రెండు దేశాల మధ్య విశిష్టమైన సంబంధాలకు ఒక నమూనా గా భారతదేశం మరియు భూటాన్ ఉంటాయి అని నేను నమ్ముతున్నాను.
ఈ సుందరమైన ద్రూక్ యూల్ ను మళ్లీ సందర్శించే అవకాశాన్ని ఇచ్చినందుకు,
మీ యొక్క ప్రేమ ను మరియు మీ యొక్క సాదర స్వాగతాన్ని పంచి ఇచ్చినందుకు మరొక్క మారు అనేకానేక ధన్యవాదాలు.
తాశీ డెలెక్
**
130 करोड़ भारतीयों के दिलों में भूटान एक विशेष स्थान रखता है ।
— PMO India (@PMOIndia) August 17, 2019
मेरे पिछले कार्यकाल के दौरान, प्रधानमंत्री के रूप में मेरी पहली यात्रा के लिए भूटान का चुनाव स्वाभाविक था। इस बार भी, अपने दूसरे कार्यकाल के शुरू में ही भूटान आकर मैं बहुत खुश हूं: PM
यह भारत का सौभाग्य है कि हम भूटान के विकास में प्रमुख भागीदार हैं। भूटान की पंचवर्षीय योजनाओं में भारत का सहयोग आपकी इच्छाओं और प्राथमिकताओं के आधार पर आगे भी जारी रहेगा: PM
— PMO India (@PMOIndia) August 17, 2019
SAARC करेंसी स्वैप फ्रेमवर्क के तहत भूटान के लिए करेंसी स्वैप की limit बढ़ाने के लिए हमारा नज़रिया positive है। इस बीच, विदेशी मुद्रा की आवश्यकता को पूरा करने के लिए स्टैंडबाय स्वैप व्यवस्था के तहत अतिरिक्त 100 मिलियन डॉलर भूटान को उपलब्ध होंगे: PM
— PMO India (@PMOIndia) August 17, 2019
Space technology के उपयोग से भूटान के विकास में तेजी लाने के लिए भारत प्रतिबद्ध है। हमने आज south asia satellite के अर्थ स्टेशन का उद्घाटन किया है। यह भूटान में communication, public broadcasting और disaster management के कवरेज को बढ़ाएगा: PM
— PMO India (@PMOIndia) August 17, 2019
Royal Bhutan University और भारत के IITs और कुछ अन्य top शिक्षा संस्थानों के बीच सहयोग और संबंध शिक्षा और टेक्नोलॉजी के लिए आज की आवश्यकताओं के अनुरूप हैं ।
— PMO India (@PMOIndia) August 17, 2019
कल Royal Bhutan University में इस देश के प्रतिभाशाली युवाओं से मुलाक़ात की मैं उत्सुकता से प्रतीक्षा कर रहा हूँ: PM
मुझे बहुत खुशी है कि आज हमने भूटान में RuPay कार्ड को launch किया है। इससे डिजिटल भुगतान, और व्यापार तथा पर्यटन में हमारे संबंध और बढेंगे।
— PMO India (@PMOIndia) August 17, 2019
हमारी साझा आध्यात्मिक विरासत और मजबूत people-to-people संबंध हमारे संबंधों की जान हैं: PM
भारत-भूटान संबंधों का इतिहास जितना गौरवशाली है, उतना ही आशाजनक भविष्य भी है।
— PMO India (@PMOIndia) August 17, 2019
मुझे विश्वास है कि भारत और भूटान दुनिया में दो देशों के बीच संबंधों का एक अनूठा मॉडल रहेंगे: PM