Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సమక్షంలో పరిపాలన, శాస్త్ర విజ్ఞానం & సాంకేతిక విజ్ఞానం, మరియు శక్తి & పర్యావరణం లపై తమ తమ ఆలోచనలను నివేదించిన మూడు కార్యదర్శుల బృందాలు

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సమక్షంలో పరిపాలన, శాస్త్ర విజ్ఞానం & సాంకేతిక విజ్ఞానం, మరియు శక్తి & పర్యావరణం లపై తమ తమ ఆలోచనలను నివేదించిన మూడు కార్యదర్శుల బృందాలు


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సమక్షంలో భారతదేశ ప్రభుత్వ కార్యదర్శుల బృందాలు మూడు పరిపాలన, శాస్త్ర విజ్ఞానం & సాంకేతిక విజ్ఞానం, మరియు శక్తి & పర్యావరణం లపై తమ తమ ఆలోచనలను ఈ రోజు నివేదించాయి.

“పరిపాలన”కు సంబంధించిన సమర్పణలో ప్రధానంగా పౌరులకు అందించవలసిన సేవలు, అందరినీ డిజిటల్ సేవల పరిధిలోకి తీసుకురావడం, నవకల్పనతో పాటు చట్టాలను సులభతరం చేయడం వంటి విషయాలు చోటుచేసుకొన్నాయి.

“శాస్త్ర విజ్ఞానం & సాంకేతిక విజ్ఞానం” సంబంధ సమర్పణలో జ్ఞానాన్నిఅందరి అందుబాటులోకి తీసుకురావడం తో పాటు మెరుగైన అవకాశాలను కల్పించడం, ఉద్యోగాలు మరియు స్టార్ట్- అప్ లు, ఇంకా శాస్త్ర విజ్ఞాన రంగంలో సులభంగా ముందడుగు వేయడం వంటి అంశాలపై శ్రద్ధ తీసుకోవడం జరిగింది.

ఇక “శక్తి & పర్యావరణం” సంబంధ సమర్పణలో వివిధ శక్తి వనరులు మరియు శక్తిని పొదుపుగా వినియోగించడం తాలూకు సలహాలు ప్రముఖంగా చోటు చేసుకొన్నాయి.

ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, నీతి ఆయోగ్ కు చెందిన అధికారులు కూడా పాల్గొన్నారు.

ప్రస్తుత పరంపరలో మొత్తం తొమ్మిది కార్యదర్శుల బృందాలు పాలనకు సంబంధించిన వేరు వేరు అంశాలపై తమ తమ సమర్పణలను నివేదించవలసి ఉండగా, ఇంతవరకు నాలుగు సమర్పణలను నివేదించడమైంది.

***