పిఎంఇండియా
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ బాంగ్లాదేశ్ ప్రధాని, శ్రేష్ఠురాలు మేడమ్ శేఖ్ హసీనా తో సంభాషించారు.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వం లోని ఎన్ డిఎ ప్రభుత్వానికి భారతదేశ ప్రజలు ఇచ్చినటువంటి స్పష్టమైన తీర్పు పట్ల తన అభినందనలను తెలిపేందుకు బాంగ్లాదేశ్ ప్రధాని తాను చొరవ తీసుకొని ప్రధాన మంత్రి శ్రీ మోదీ తో టెలిఫోన్ లో మాట్లాడారు. ఇలా చేసినందువల్ల, ప్రధాన మంత్రి ని అభినందించిన విదేశీ నేతల లో ఆమె మొట్టమొదటి నేత అయ్యారు. తద్వారా భారతదేశానికి, బాంగ్లాదేశ్ కు మధ్య ఉన్నటువంటి సన్నిహితమైన, హార్దిక సంబంధాలకు ఆమె దర్పణం పట్టినట్లయింది; అంతేకాదు, ఈ ఉభయ నేతలకు మధ్య గల ఉత్తమ సౌహార్దత కూడా దీనితో వెల్లివిరిసినట్లయింది.
భారతదేశం- బాంగ్లాదేశ్ సంబంధాలను ఇదివరకు ఎరుగనటువంటి నూతన శిఖరాలకు చేర్చే ప్రయత్నాలను కొనసాగించాలని నేతలిరువురూ ప్రతిన పూనారు. రక్షణ సంబంధ వ్యాపారం, రవాణా, శక్తి, ఇంకా ప్రజలకు ప్రజలకు మధ్య సంబంధాల లో భాగస్వామ్యాన్ని పెంపొందింపచేసుకోవడానికి ప్రస్తుతం ఆచరణ లో పెడుతున్న ప్రణాళికల ను శరవేగం గా పూర్తి చేయడానికి ప్రాముఖ్యం ఇవ్వవలసివుందని వారు గుర్తించారు. 2020వ సంవత్సరం లో బంగబంధు శేఖ్ ముజిబుర్ రహమాన్ శత జయంతి, 2021వ సంవత్సరం లో బాంగ్లాదేశ్ విముక్తి తాలూకు 50వ వార్షికోత్సవం ఉన్నాయన్న సంగతి ని దృష్టిలో పెట్టుకొంటే రానున్న 3 సంవత్సరాల లోపల ఈ పని ని చేయడానికి నిర్దిష్ట ప్రాధాన్యాన్ని కట్టబెట్టినట్లు అవుతుంది.
ద్వైపాక్షిక సంబంధాల లో భాగం గా చేసే కృషి ని పున:ప్రారంభించడం కోసం సాధ్యమైనంత త్వరలో ఒక సమావేశాన్ని నిర్వహించుకోవడానికి అనువైన తేదీ లను గుర్తించాలని నేతలు ఉభయులూ ఒక అంగీకారానికి వచ్చారు.
******